పెళ్లికి ముందు ఆ స్టార్ హీరోతో ప్రేమాయణం నడిపిన కాజల్..!?

Anilkumar
టాలీవుడ్ చందమామగా పేరు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మి కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కాజల్. చందమామ సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ గుర్తింపు తెచ్చుకుంది. దాని అనంతరం బృందావనం ,మగధీర సినిమాలతో పూర్తిగా స్టార్ హీరోయిన్గా మారిపోయింది. తెలుగు తోపాటు కోలీవుడ్ టాలీవుడ్ లో సైతం పలు సినిమాలు చేసి అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఇక అలా స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన చిన్ననాటి స్నేహితుడైన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ ని ప్రేమ వివాహం చేసుకుంది కాజల్. 

ఇక ఈ దంపతులకు గత సంవత్సరం ఒక బాబు కూడా పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత మళ్లీ కాజల్ తన కెరియర్ పై దృష్టి పెట్టి సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. ప్రస్తుతం ఈమె చేతిలో కమలహాసన్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఇండియన్ టు దాంతోపాటు నందమూరి బాలకృష్ణ మరియు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో కూడా హీరోయిన్గా నడుస్తోంది కాజల్. అయితే ఇప్పుడు కాజల్ కి సంబంధించిన ఒక వార్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది .

అదేంటంటే సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ఎఫైర్ లు సాధారణమే .అయితే అలా కాజల్ పై కూడా ఒక రూమర్ ఉంది. అదేంటంటే కాజల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో ప్రేమలో పడిందని.. సీక్రెట్ గా బన్నీతో ఎఫైర్ నడుస్తుంది అంటూ అప్పట్లో రకరకాల వార్తలు వచ్చాయి. వీరిద్దరూ మొదటిసారిగా ఆర్య 2 సినిమాలో కలిసి నటించారు. ఇక అప్పట్లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టింది అన్న వార్తలు అప్పట్లో జోరుగా వినిపించాయి. అదే సమయంలో ఒక రిపోర్టర్ ఈ విషయంపై నేరుగా కాజల్ ని ప్రశ్నించడం జరిగింది. దానికి కాజాల సమాధానమిస్తూ నేను ఏ హీరోతో రిలేషన్ షాప్ లో లేను అని కరాకండిగా చెప్పేసింది. దాని తర్వాత కొన్నాళ్లకు అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: