రష్మిక బ్యాక్ టు టాలీవుడ్..!

shami
కన్నడ భామ రష్మిక మందన్నని తెలుగు ఫ్యాన్స్ చాలా మిస్ అవుతున్నారు. ఛలో తో తెలుగు సినిమాల్లో తెరంగేట్రం చేసిన అమ్మడు ఆ సినిమా నుంచి వెనక్కి తిరిగు చూసుకోకుండా వరుస ఛాన్స్ లు అందుకుంది. స్టార్ హీరోలతో కూడా నటిస్తూ మెప్పించిన అమ్మడు లాస్ట్ ఇయర్ బాలీవుడ్ ఆఫర్ లు రాగానే అక్కడికి షిఫ్ట్ అయ్యింది. టాలీవుడ్ మేకర్స్ తో చర్చలు జరుపుతున్నా ఏ సినిమా ఇప్పటివరకు ఫిక్స్ అవలేదు. అయితే హిందీ లో చేసిన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అందుకే రష్మిక తిరిగి మళ్లీ తెలుగు సినిమాలనే చేయాలని అనుకుంటుందట.
బ్యాక్ టు టాలీవుడ్ అని.. తనని దర్శక నిర్మాతలు కన్సిడర్ చేయాలని చెబుతుందట. నిజానికి రష్మిక టాలీవుడ్ వదిలి ఏమి వెళ్లలేదు జస్ట్ హిందీ లో రెండు వరుస సినిమాల వల్ల అక్కడ బిజీ అయ్యింది. అయితే అమ్మడికి తెలుగులో ఛాన్స్ లు మాత్రం ఆగిపోయాయి. లాస్ట్ ఇయర్ సీతారామం చేసిన రష్మిక పుష్ప 2, యానిమల్ సినిమాలతో పాటుగా నితిన్ కొత్త సినిమా లో ఛాన్స్ అందుకుంది. ఇదే కాకుండా రెయింబో అంటూ ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా కు అమ్మడు సైన్ చేసింది. సో తెలుగులో మళ్లీ బిజీ అవ్వాలని చూస్తున్న రష్మికకు ఇక్కడ ఫ్యాన్స్ సూపర్ వెల్కం చెబుతున్నారు.
సినిమాలతోనే కాదు విజయ్ దేవరకొండ విషయంలో కూడా రష్మికని టార్గెట్ చేస్తున్నారు ఆడియన్స్. విజయ్ రష్మికల మధ్య ఉన్న రిలేషన్ ఏంటని తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఇద్దరు కలిసి ఔటింగ్స్ కు వెళ్తున్నా ఇద్దరిలో ఎవరు ఆ విషయాన్ని బయట పెట్టట్లేదు. అయితే రష్మిక మాత్రం ఫ్యాన్స్ ఊహిస్తున్నట్టుగా ఏమి లేదంటూ అప్పుడప్పుడు తన కామెంట్స్ కు రిప్లై ఇస్తుంది. విజయ్ మాత్రం రష్మిక విషయంలో ఎలాంటి క్లూస్ ఇవ్వట్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: