"విరూపాక్ష" మూవీకి సంబంధించిన అఫీషియల్ కలెక్షన్ల వివరాలను విడుదల చేసిన మూవీ యూనిట్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికుల పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించిన సాయి తేజ తాజాగా విరూపాక్ష అనే సస్పెన్స్ ... థ్రిల్లర్ ... హార్రర్  జోనర్ మూవీ లో హీరో గా నటించాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.
 

దానితో ఈ సినిమాకు ఇప్పటికే అద్భుతమైన కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమా విడుదల అయ్యి 10 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 10 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన గ్రాస్ కలెక్షన్ లకు సంబంధించిన వివరాలను ఈ చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమా 10 రోజుల్లో 76 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసి అదిరిపోయే రేంజ్ లాభాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుంది. ఈ మూవీ లోని సాయి తేజ్ ... సంయుక్త నటనకు గను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.  అలాగే ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి కార్తీక్ దండు కు కూడా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: