"ఆర్సి16" లో హీరోయిన్ పాత్ర కోసం ఆ క్రేజీ బ్యూటీతో సంప్రదింపులు జరుపుతున్న మూవీ యూనిట్..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉండగా ... దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులు అయినటువంటి శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందుతుంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎస్ జే సూర్య ఈ మూవీ లో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు.

సునీల్ , శ్రీకాంత్ , అంజలి మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనుండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కానునట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ పూర్తి అయిన తర్వాత చరణ్ ... బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా చరణ్ కెరియర్ లో 16 వ మూవీ గా రూపొందబోతుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ను హీరోయిన్ గ తీసుకునే ఆలోచనలో ఈ మూవీ మేకర్స్ ఉన్నట్లు ... అందులో భాగంగా ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మతో ఈ మూవీ మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం జాన్వి కపూర్ ... జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: