ఎన్టీఆర్ కు డబుల్ ధమాకా.. ఎన్టీఆర్ 30 సినిమాలో మరో స్టార్ హీరోయిన్..!?

Anilkumar
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ హిట్ అందుకున్న సంగతి మన అందరికీ తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నా ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇక ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు  ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఎన్టీఆర్ 30 సినిమాపై టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కి జంటగా జాన్వికపూర్ హీరోయిన్గా నటిస్తోంది. 

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ఎన్టీఆర్ కి ప్రతి నాయకుడిగా నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ ప్రతి ఒక్కరిని ఎంతో ఆకట్టుకునేలా ఉంది. చాలా టైం తీసుకుని కొరటాల ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ని పూర్తి చేస్తున్నాడు. కాగా కొన్ని వారాల క్రితమే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా మొదలుపెట్టడం జరిగింది. ఇకపోతే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చాలా డిఫరెంట్ గా కనిపించపోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరొక హీరోయిన్ కూడా నటించబోతుందన్న వార్తలు వినబడుతున్నాయి.

ఇక ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు లేడీ పవర్ స్టార్ గా మంచి గుర్తింపును తెచ్చుకున్న సాయి పల్లవి ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కి జంటగా నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడే కాదు గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ సాయి పల్లవి కలిసి నటిస్తున్నారు అని పలు రకాల వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా మళ్లీ ఇప్పుడు అవే వార్తలు వినబడుతున్నాయి. ఇక ఈ వార్తలు నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది అని చెప్పాలి .ఇకపోతే ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూసేందుకు సినీ అభిమానులు ఎదురు చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: