బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పిన రకుల్.. నిజమేనా..!?

Anilkumar
తెలుగు సినీ ఇండస్ట్రీలో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో హీరోయిన్గా మంచి పాపులారిటీని దక్కించుకుంది రకుల్ ప్రీత్ సింగ్. తర్వాత చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అనంతరం స్టార్ హీరోల సరసన వరుస సినిమాలలో నటించి టాలీవుడ్ ని తన వశం చేసుకుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన అందం, అభినయం, నటనతో ఎంతో మంది అభిమానులను తన సొంత చేసుకుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ మరింత క్రేజ్ ని దక్కించుకుంది. 

ముఖ్యంగా చెప్పాలి అంటే యంగ్ హీరోల నుండి సీనియర్ హీరోల వరకు అందరి సరసన హీరోయిన్గా నటించి మరింత గుర్తింపును సంపాదించుకుంది. ఇదిలా ఉంటే ఇక బాలీవుడ్ నటుడు నిర్మాత అయిన జాకీభగ్నని తో ప్రేమలో ఉన్నట్లుగా ప్రకటించి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది రకుల్. అయితే కరోనా సమయంలో తాను జాకీ భగ్నానితో ప్రేమలో ఉన్నట్టుగా తెలిపింది. ఒకరికొకరు తోడుగా ఉన్నామని ఆ సమయంలోనే తామద్దరము ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమలో ఉన్నామని తెలిపింది. అయితే తమ ప్రేమ విషయాన్ని బహిరంగంగా బయటపెట్టిన ఈమె తన బాయ్ ఫ్రెండ్ తో బయట తిరుగుతూ ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

 వారిద్దరూ బయట కలిసి తిరగడం తక్కువే అయినప్పటికీ వారిద్దరికీ సంబంధించిన చిన్న వార్త అయినా సరే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పద్యంలోనే త్వరలోనే వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అన్న వార్తలు వినిపించాయి. ఇదిలా ఉంటే ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం వీరిద్దరూ విడిపోయారని తెలుస్తోంది. అంతేకాదు ఎవరికి వారు తమ పనుల్లో బిజీగా ఉన్నారని కూడా అంటున్నారు. కలవడం కూడా చాలావరకు తగ్గించేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే వీరిద్దరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండి కలవడం లేదా లేదా బ్రేకప్ చేసుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: