అలా చేయడం వల్లే నాని సినిమాలన్నీ హిట్ అవుతున్నాయా..!?

Anilkumar
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి స్టార్ హోదాను అందుకున్న నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నాచురల్ స్టార్ నాని రెమ్యూనరేషన్ కూడా కోట్లల్లోనే ఉంది. ప్రస్తుతం నాని ఒక్కో సినిమాకి గాను దాదాపుగా 22 కోట్లకు పైగానే ఉంది. అంతేకాదు సినిమా సినిమాకి రెమ్యూనరేషన్ పెంచేస్తున్నాడు నాని. మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నానికి ఈ మధ్య వరుస విజయాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇలా ఉంటే ఇక నాని ఇలా వరుసగా చేస్తున్న సినిమాలన్నీ కూడా హిట్ టాక్ తో దూసుకుపోవడానికి ఒక ముఖ్య కారణం ఉందని కూడా అంటున్నారు. 

తాజాగా అందుతున్న సమాచారం మేరకు తన సినిమాలలో హీరోయిన్ల ఎంపిక విషయంలో ఆయన చేసిన మార్పే నానికి ప్లస్ అయింది అన్న సమాచారం వినబడుతుంది. ప్రస్తుతం నాని తన సినిమాలలో ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్లనే తీసుకుంటూ జాగ్రత్త పడుతున్నాడు  ఈ విధంగా క్రేజ్ ఉన్న హీరోయిన్లు నటించినవల్ల ఆ సినిమాకు మంచి క్రేజ్ వస్తుందని అంటున్నారు. అంతేకాదు ఆ సినిమాలకి రికార్డు స్థాయిలో బిజినెస్ జరగడంతో పాటుగా నాని సినిమాలకు అన్ని విధాలుగా కూడా ప్లస్ అవుతుంది. ఇకపోతే ఎంసీఏ సినిమా తర్వాత దేవదాసు సినిమా తప్పించి మిగిలిన అన్ని సినిమాలలో పెద్దగా గుర్తింపు లేని హీరోయిన్లు నాని సినిమాలో హీరోయిన్లుగా నటించడం జరిగింది.

ఆ సమయంలోనే ఆయన సినిమాలన్నీ కూడా షాకింగ్ ఫలితాలను అందుకున్నాయి.అనంతరం శ్యామ్ సింగరాయ్ సినిమా తర్వాత నుండి రూట్ మార్చాడు నాని. మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి రావడానికి దాంతో పాటుగా తన కెరీర్ని కూడా బాగా ప్లాన్ చేసుకునే దిశగా అడవులు వేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇక నాని తర్వాతే సినిమాలో రుణాలు ఠాగూర్ మరియు శృతిహాసన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇద్దరు హీరోయిన్లు మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లే. దాంతోపాటు సలార్ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా విడుదల కావడం నానికి బాగా ప్లస్ అవుతుందని తెలుస్తుంది. ఇకపోతే శృతిహాసన్ నాని కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా ఇదే కావడం గమనార్హం..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: