గౌతమ్ నంద సినిమా గురించి సంచలన విషయాలను బయటపెట్టిన గోపిచంద్..!?

Anilkumar
టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ మరియు జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్న రామబాణం సినిమా మీ 5న విడుదల కాబోతుంది. అయితే ఈ నెలలో విడుదలైన సినిమాలలో విరూపాక్ష సినిమా తప్ప మరి ఏ సినిమా కూడా సక్సెస్ సాధించలేదు. రామబాణం సినిమాకు మరే సినిమా సక్సెస్ అందుకోలేకపోవడం ప్లస్ కానుందని కూడా అంటున్నారు. అయితే తాజాగా గోపీచంద్ ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఇంటర్వ్యూలో భాగంగా పలు ఆసక్తికరమైన విషయాలను కూడా వెల్లడించారు.

 తన జీవితంలో బాగా అంచనాలు పెట్టుకున్నా.. సినిమా ఫ్లాప్ అయిందని.. ఆ సినిమా గౌతమ్ నంద అని చెప్పుకొచ్చాడు గోపీచంద్. గౌతమ్ నంద సినిమా చాలా బాగా ఆడుతుందని ఆశించాడట గోపీచంద్. ఆ సినిమాలో చిన్న చిన్న తప్పులు ఉన్నాయని అయినప్పటికీ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుందని చిత్ర బృందం తో సహా నేను కూడా భావించాను అంటూ చెప్పుకొచ్చాడు. గౌతమ్ నంద సినిమా మేము అనుకున్న విధంగా విజయాన్ని అందుకోలేదు అని అంటూ తన అభిప్రా యాన్ని తెలియజేశాడు. సినిమాలో కొన్ని కొన్ని తప్పులు ఉన్నాయని అందుకు నేను ఒప్పుకుంటున్నాను అంటూ కూడా తెలియజేశాడు.

సినిమా విడుదలైన తర్వాత ఈ తప్పులను ప్రేక్షకులు క్షమిస్తారని అనుకున్నాను గాని క్షమించలేదు సినిమాని ప్లాప్ చేశారని చెప్పాడు. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే నాకు సినిమా రిజల్ట్ తెలిసిపోయింది. కానీ నటించాను అని కూడా అన్నాడు. సినిమా చేసేటప్పుడు నేను వందకి 100% ఆ సినిమాకి చేస్తానని అలా చేస్తే కచ్చితంగా ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని నాకు ముందే తెలుసు అని కూడా చెప్పాడు. ఈ విషయాన్ని నేను ముందే చెప్పాను కానీ ఎవరు నా మాట వినలేదు అంటూ కూడా తెలియజేశాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం గోపీచంద్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లతో అయినా సక్సెస్ సాధించాలని భావిస్తున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: