పూరి కొత్త సినిమా.. భలే ట్విస్ట్ ఇచ్చాడు భయ్యో?

praveen
టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్న పూరి జగన్నాద్ ను విజయ దేవరకొండ తో తీసిన పాన్ ఇండియా మూవీ లైగర్ కోలుకోలేని దెబ్బ కొట్టింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఫ్లాప్ తో ఎన్నో రోజులపాటు మీడియా ముందుకు రాలేకపోయారు పూరి జగన్నాథ్. అయితే ఇప్పటికే ఎన్నోసార్లు క్లిష్ట పరిస్థితుల నుంచి కోలుకొని కం బ్యాక్ ఇచ్చిన పూరి జగన్నాథ్ ఇక ఇప్పుడు మరోసారి లైగర్ ప్లాప్ నుంచి బయటపడి కొత్త సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు.  ఈ క్రమంలోనే ఎన్నో రోజుల తర్వాత తనకు హిట్ ఇచ్చిన హీరో అయినా రామ్ పోతినేనితో మరో ప్రాజెక్ట్ తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు అంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.

 మరోసారి ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్బస్టర్ ప్లాన్ చేశాడు అంటూ ఇక పూరి అభిమానులకు ఒక గుడ్ న్యూస్ అందింది. అయితే త్వరలో అధికారిక ప్రకటన రాబోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు పూరి జగన్నాథ్ అందరికీ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు అన్నది మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే పూరి జగన్నాథ్ కొత్త సినిమా చేస్తున్న మాట నిజమేనట. కానీ ఆ సినిమా రామ్ పోతినేనితో చేయట్లేదట.. నందమూరి బాలకృష్ణతో పూరి కొత్త సినిమా ఉంటుందని ప్రస్తుతం ఒక టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రామ్ పోతినేని తో సినిమా క్యాన్సల్ అవ్వలేదట. బాలయ్య సినిమా తర్వాత ఆ సినిమా కూడా ఉంటుందట.


అయితే దీనికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది అని చెప్పాలి. అయితే గతంలో పూరి జగన్నాథ్, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో పైసా వసూల్ అనే సినిమా వచ్చింది. భారీ అంచనాల  మధ్య వచ్చిన ఈ సినిమా పెద్దగా ప్రేక్షక ఆదరణను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. కానీ పూరి జగన్నాథ్ అటు బాలయ్యను చూపించిన తీరు మాత్రం అభిమానులను తెగ ఆకర్షించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: