KKR ప్లేయర్ కి షారుక్ ఖాన్ సర్ప్రైజ్ గిఫ్ట్..?

Anilkumar
ఐపీఎల్ 2023 ఎంతో రసవత్తరంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈసారి క్రిక్రెట్ లవర్స్ కి సినిమాలకు మించి ట్విస్టులు, షాక్ లు ఇస్తున్నారు ఆటగాళ్లు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 9న కోల్కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. క్రికెట్ లవర్స్ ప్రతి ఒక్కరు ఆ మ్యాచ్ ని అంత ఈజీగా మర్చిపోలేరు. ఎందుకంటే ఆ మ్యాచ్లో కోల్కతా ఆటగాడు రింకు సింగ్ ఓ అద్భుతమే చేశాడు. ఆఖరి ఓవర్లో కేవలం 5 బంతుల్లో 28 పరుగులు కావాల్సి వచ్చినప్పుడు రింకు సింగ్ ఆడిన తీరు వేరే లెవెల్ అని చెప్పాలి.వరుసగా ఐదు బంతుల్లో ఏకంగా ఐదు సిక్సర్లు బాది కోల్కతాకు అత్యద్భుతమైన విజయాన్ని అందించాడు. 

ఇక రింకు ఆట తీరుకు స్టేడియంలో ఉన్న వాళ్లే కాదు టీవీలో చూస్తున్న ప్రతి క్రికెట్ లవర్ కూడా ఫిదా అయిపోయారు. ఇక ఈ మ్యాచ్లో హైలెట్గా నిలిచిన రింకు సింగ్ ఆటతో మన కేకేఆర్ ఓనర్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ చాలా ఇంప్రెస్ అయ్యి.. రింగు సింగ్ కి స్వయంగా కాల్ చేసి మరి అభినందించారట. ఇక అదే రోజు పఠాన్ మూవీ పోస్టర్కు రింకు సింగ్ ఫేస్ ను ఆడ్ చేసి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు షారుక్ ఖాన్. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కేకేఆర్ ప్లేయర్ రింకు సింగ్.. షారుక్ ఖాన్ తనతో ఫోన్ లో ఏం మాట్లాడారో వివరించాడు.' తన ఆటతీతో షారుక్ ఖాన్ చాలా ఇంప్రెస్ అయ్యారని, ఇలాంటి ప్రదర్శనను భవిష్యత్తులోనూ తన నుండి కోరుకున్నట్లు చెప్పుకొచ్చాడు రింకు సింగ్.

అంతేకాదు తన పెళ్లి రోజు షారుక్ ఖాన్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని కూడా చెప్పాడంటూ' తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అయితే ఆ గిఫ్ట్ ఏంటి అనేది మాత్రం రివిల్ చేయలేదు ఈ కేకేఆర్ ప్లేయర్. దీంతో రింకు సింగ్ తాజా ఇంటర్వ్యూలో చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి. ఇక ఆరోజు గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ తర్వాత ఏరోజు కేకేఆర్ మ్యాచ్ ఉన్నా.. కచ్చితంగా ఆరోజు రింకు సింగ్ ఆట కోసమే క్రికెట్ లవర్స్ అంతా మ్యాచ్ చూస్తున్నారంటే అతిశక్తి కాదేమో. కేవలం ఒకే ఒక్క మ్యాచ్ తో అంత క్రేజ్ సంపాదించుకున్నాడు రింకు సింగ్...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: