సమంతను పట్టించుకోని టాలీవుడ్ స్టార్స్.. కావాలనే అలా చేస్తున్నారా..?

Anilkumar
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సమంత కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు టాలీవుడ్ లో ఉన్న టాప్ స్టార్స్ అందరితోనూ సినిమాలు చేసింది సమంత. చాలామంది అగ్ర హీరోలతో ఈమెకు మంచి బాండింగ్ కూడా ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి బడా హీరోలతో సినిమాలు చేసి ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టింది సామ్. ఇక బన్నీ తారక్ లతో అయితే వరుస సినిమాలు చేసింది. రామ్ చరణ్ తో రంగస్థలం అనే సినిమాతో ఇండస్ట్రీ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. అలా ఇప్పుడున్న స్టార్ హీరోలతో సమంతకు మంచి ర్యాపో ఉంది. కానీ ఈ అగ్ర హీరోలు సమంతను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 

ఈరోజు సమంత పుట్టినరోజు. అయితే సమంతకు బర్త్ డే విషెస్ చెప్పేందుకు మాత్రం టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలు ఎవరు ముందుకు రావడం లేదు. తాజాగా సమంతకు అనుష్క, కీర్తి సురేష్, సుకుమార్ భార్య, మంచు లక్ష్మి, లావణ్య త్రిపాఠి, రష్మిక మందన్న, రుహాని శర్మ.. ఇలా హీరోయిన్స్ అంతా బర్త్డే విషెస్ అందించారు. కానీ హీరోలు ఎవ్వరూ కూడా సమంతని విష్ చేయలేదు. తాజాగా మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సమంత తనకు ఇష్టమైన నటి అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. సమంతకు విషెస్ కూడా చెప్పాడు. అటు సమంత బెస్ట్ ఫ్రెండ్ అయిన వెన్నెల కిషోర్ కూడా సమంతకు బర్త్డే విషెస్ అందించాడు. వీళ్ళు తప్ప ఏ టాలీవుడ్ స్టార్ హీరో స్పందించలేదు.

నిజానికి ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోలకు అందరికీ సమంత విషెస్ చెబుతుంది. వారి సినిమాలపై కూడా స్పందిస్తూ ఉంటుంది. కానీ ఈ హీరోలు కనీసం బర్త్డే రోజు కూడా సమంతకు విష్ చేయలేదు. దీంతో సమంతను ఈ స్టార్ హీరోలు పట్టించుకోవడంలేదని క్లారిటీగా అర్థమవుతుందని అంటున్నారు విశ్లేషకులు. ఇక ఇదిలా ఉంటే సమంత బర్త్డే సందర్భంగా ఆమె నటిస్తున్న 'ఖుషి' సినిమా నుంచి పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. అంతేకాకుండా ఖుషి మూవీ టీం నుండి దర్శకుడు శివ నిర్వాణ, హీరో విజయ్ దేవరకొండ సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: