ఆ బాలీవుడ్ హీరోని లైన్ లో పెట్టి ఛాన్స్ కొట్టేసిన రకుల్ ప్రీత్ సింగ్..?

Anilkumar
టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. కెరీర్ బిగినింగ్ లో సౌత్ హీరోలతో నటించి స్టార్ డం ని సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ కి గత కొంతకాలంగా సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో ఈ అమ్మడు బాలీవుడ్ లో ఓ రేంజ్ లో ఎక్స్పోజింగ్ చేస్తోంది. అలా తన గ్లామర్ ట్రీట్ తో బాలీవుడ్ లో ఎలాగోలా నెట్టుకు వస్తుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ఓ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసినట్లు బి టౌన్ లో టాక్ నడుస్తోంది. నిజానికి ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కి ఆఫర్ రావడానికి మెయిన్ రీజన్ సిద్ధార్థ మల్హోత్రనే అని అంటున్నారు. 

డైరెక్టర్ కి ఏ మాత్రం ఇష్టం లేకపోయినా ఏరి కోరి రకుల్ ప్రీత్ సింగ్ కి అవకాశం ఇచ్చాడట ఈ బాలీవుడ్ హీరో. రకుల్ కి ప్రస్తుతం తెలుగులో ఎలాంటి ఆఫర్స్ రావడం లేదు. టాలీవుడ్ లో తనకు ఆఫర్స్ తగ్గుముఖం పట్టాయనే విషయం తెలుసుకున్న ఈ బ్యూటీ వెంటనే బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ పలు సినిమాలో నటించినా.. అవి ఏమాత్రం వర్కౌట్ కాలేదు. దాంతో బాలీవుడ్ దర్శక నిర్మాతలను ఆకట్టుకోవడానికి ఈ ముద్దుగుమ్మ గ్లామర్ ట్రీట్ తో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పోజింగ్ చేస్తూ వచ్చింది. ఇక ఈ అమ్మడు అందానికి బాలీవుడ్ మేకర్స్ ఫిదా అయిపోయారు. దీంతో రోజురోజుకీ తన గ్లామర్ డోస్ ని పెంచుకుంటూ పోతుంది రకుల్.

సోషల్ మీడియాలో అయితే తన అందాల ఆరబోతతో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది. ఇక సోషల్ మీడియాలో ఈమె గ్లామర్ ట్రీట్ కి ఓ రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈమె గ్లామర్ ట్రీట్ ని మెచ్చిన కొంతమంది బాలీవుడ్ మేకర్స్ ఈమెకు అడపాదడపా అవకాశాలు ఇస్తున్నారు. అలాంటి రకుల్ ప్రీత్ సింగ్ సిద్ధార్థ మల్హోత్రా కళ్ళలో పడింది. బాలీవుడ్లో ఆఫర్ల కోసం అతనితో నిత్యం టచ్ లో ఉంటూ ఎట్టకేలకు అతని సినిమాలోనే నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ న్యూస్ బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారుతుంది. మరి ఈ సినిమాతో నైనా రకుల్ ప్రీత్ సింగ్ కి బాలీవుడ్ లో మంచి సక్సెస్ వస్తుందేమో చూడాలి. కాగా బాలీవుడ్ తో పాటూ ఈ మధ్య టాలీవుడ్ లో కూడా మళ్ళీ నటించాలని ప్రయత్నాలు చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ మేరకు కొంతమంది టాలీవుడ్ దర్శక నిర్మాతలతో ఈ హీరోయిన్ సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: