'విరుపాక్ష' డైరెక్టర్ కి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన సంయుక్త మీనన్..?

Anilkumar
సాయి ధరమ్ తేజ్ నటించిన 'విరూపాక్ష' మూవీ ఇటీవల విడుదలై ఈ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా విరూపాక్ష మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో తేజు సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 21న విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ నటనపై సినీ ప్రేక్షకులతో పాటు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. 

ఈ క్రమంలోనే తాజాగా దర్శకుడు కార్తీక్ దండు కి సంయుక్త మీనన్ ఐఫోన్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేశారు. విరూపాక్ష సినిమా రిలీజ్ రోజు మూవీ యూనిట్ తో కలిసి కార్తీక్ హైదరాబాద్ లోనే ఓ థియేటర్కు వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ ఆడియన్స్ రద్దీ ఎక్కువగా ఉండటంతో థియేటర్లో కార్తీక్ ఫోన్ పోయింది. ఆ విషయాన్ని తెలుసుకున్న సంయుక్త వెంటనే ఐఫోన్ ప్రో మోడల్ మొబైల్ ని డైరెక్టర్ కి గిఫ్ట్ గా ఇచ్చింది. తాజాగా ఈ విషయం గురించి సంయుక్త మీనన్ చెబుతూ..' సినిమా హిట్ అయిన సందర్భంగా కార్తీక్ కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్న. సరిగ్గా ఆ సమయంలోనే ఫోన్ పోయిందని తెలిసింది. దాంతో ఆయనకు వచ్చే ఫోన్ కాల్స్, మెసేజెస్ ఆగిపోయాయి.

అందుకని వెంటనే ఫోన్ కొనిచ్చా. అయినా సిమ్ పని చేయడానికి ఒకరోజు పట్టింది.దాంతో సోషల్ మీడియాలో సినిమాపై ఎలాంటి చర్చ జరుగుతుందో తెలుసుకోవడానికి మూవీ టీంలో మిగతా వాళ్ళ ఫోన్ ద్వారా కార్తీక్ చూసేవారని' సంయుక్త చెప్పుకొచ్చింది. ఇక గత వారమే విడుదలైన ఈ సినిమా కేవలం మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకుంది. ఇటీవల 50 కోట్ల క్లబ్లో కూడా చేరి సినీ విశ్లేషకులనే ఆశ్చర్యపరిచింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై బి బి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించగా.. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు. అన్నట్టు ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉందని తాజాగా డైరెక్టర్ హింట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా విరూపాక్ష సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: