"మంగళవారం" మూవీలో అలాంటి సన్నివేశాలు ఎక్కువగా ఉండనున్నాయా..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది దర్శకులు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మంది కి మాత్రమే దర్శకత్వం వహించిన మొట్ట మొదటి మూవీ తోనే అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతూ ఉంటాయి. అలా దర్శకత్వం వహించిన మొదటి మూవీ తోనే అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న అతి కొద్ది మంది దర్శకులలో అజయ్ భూపతి ఒకరు.

ఈయన ఆర్ ఎక్స్ 100 మూవీ తో దర్శకుడు గా తన కెరీర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ మూవీ లో కార్తికేయ హీరో గా నటించగా ... పాయల్ రాజ్పుత్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తర్వాత ఈ దర్శకుడు మహా సముద్రం మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అందుకుంది. ఇలా మొదటి మూవీ తో సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ... రెండవ మూవీ తో అపజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న అజయ్ భూపతి ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న మంగళవారం అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

 తాజాగా మంగళవారం మూవీ యూనిట్ ఈ మూవీ నుండి పాయల్ కు సంబంధించిన ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో పాయల్ వెనుక నుండి ఉన్న ఫోటోను ఈ చిత్ర బంధం విడుదల చేసింది. ఇందులో పాయల్ ఏ మాత్రం బట్టలు లేకుండా ఉంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలా ఉంటే ఈ మూవీ లో అదిరిపోయే బోల్డ్ కంటెంట్ చాలా వరకు ఉండబోతున్నట్లు ... కాకపోతే ఆ బోల్డ్ కంటెంట్ ను చాలా స్ట్రాంగ్ కంటెంట్ తో ... అలాగే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో అజయ్ భూపతి ముందుకు తీసుకెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: