పెళ్లైన స్టార్ హీరోయిన్ పై మనసు పారేసుకున్న సాయి ధరమ్ తేజ్..!?

Anilkumar
సుప్రీమ్ హీరో సాయి ధరంతేజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తాజాగా విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న తేజ్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. తేజ్ కి జరిగిన యాక్సిడెంట్ నుండి కోలుకున్న తర్వాత ఆయన నటించిన మొదటి సినిమా ఇదే. ఇక కార్తీక్ వర్మ దండ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుండే హిట్ టాక్ ను అందుకుంటూ దూసుకుపోతోంది.అంతేకాదు మొదటి వారంలో నుండే భారీ కలెక్షన్స్  వసూలు చేసి రికార్డును సృష్టించింది. ఈ సినిమా వాటితో పాటు తేజ్ సినీ కెరియర్ లోనే మంచి కమర్షియల్ సినిమా కూడా.

 ఈ సినిమా మంచి హిట్ను సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఇక త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ కూడా రాబోతుందన్న ప్రచారం అయితే జరుగుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు తేజ్. ఈ సందర్భంగా ఈ సినిమా సక్సెస్ అవడంతో సోషల్ మీడియా లో తన అభిమానులతో కూడా ముచ్చటిస్తున్నాడు తేజ్ .అయితే ఈ సినిమా విడుదలకు ముందే ప్రమోషన్స్లో భాగంగా పాల్గొన్న తేజ్ తనకి సంబంధించిన ఎన్నో విషయాలను బయటపెట్టాడు. వాటితోపాటు తనకి సంబంధించిన కొన్ని వ్యక్తిగత విషయాలను కూడా తన అభిమానులతో పంచుకున్నాడు తేజ్.

 #ASK SDT  పేరుతో తన అభిమానులతో ముచ్చటిస్తూ తనకి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఇందులో భాగంగానే నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వచ్చాడు. ఇందులో భాగంగానే ఒక నిటిజన్ మీకు ఏనాటి అంటే క్రష్ అని అడిగాడు. దానికి ఊహించని సమాధానాన్ని ఇచ్చాడు. ఇందుకుగాను తేజ్ స్పందిస్తూ సమంత అని బదులిచ్చాడు. అనంతరం ప్రస్తుతం ఉన్న హీరోలలో మీ అభిమాన హీరో ఎవరో అని అడగగా మాస్ మహారాజా రవితేజ మరియు ప్రభాస్ అని సమాధానం ఇచ్చాడు.  మెగా కుటుంబంలో ఎంతమంది స్టార్ హీరోలో ఉన్నప్పటికీ రవితేజ ప్రభాస్ అంటే తనకి ఇష్టమని చెప్పడంతో మెగా అభిమానులు దాన్ని తట్టుకోలేకపోతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: