వామ్మో.. 'విరుపాక్ష' స్క్రీన్ ప్లే కోసం సుకుమార్ అన్ని కోట్లు తీసుకున్నాడా..?

Anilkumar
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తాజాగా 'విరూపాక్ష' చిత్రానికి స్క్రీన్ ప్లే అందించిన విషయం తెలిసిందే. ఈ విరూపాక్ష మూవీ ని డైరెక్ట్ చేసింది కూడా సుకుమార్ శిష్యుల్లో ఒకడైన కార్తీక్ దండు. సుకుమార్ ఎంతో ప్రతిభ ఉన్న దర్శకుడు కావడం వల్లే అతని శిష్యులు తీసిన సినిమాలు కూడా మంచి విజయాలు అందుకుంటున్నాయి. ఇక కార్తీక్ కూడా విరూపాక్ష సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా తెరక్కించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అయితే ఈ సినిమాకి సుకుమార్ ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు కేవలం స్క్రీన్ ప్లే అందించినందుకు సుకుమార్ ఏకంగా 6 కోట్ల రూపాయలు తీసుకున్నారట. 
అంతేకాదు విరూపాక్ష సినిమాకి జరిగిన బిజినెస్ ఆధారంగా సుకుమార్ లాభాల్లో సైతం వాటా తీసుకున్నారని తెలుస్తోంది. అయితే మొదట ఈ సినిమాకి సుకుమార్ నిర్మాతగా వ్యవహరించాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత సమర్పకుడిగా వ్యవహరించారు. అయితే ఈ సినిమా నిర్మాతనే సెలెక్ట్ చేసింది మాత్రం సుకుమార్ గారేనని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కార్తీక్ దండు వెల్లడించాడు. అలాగే విరూపాక్ష సక్సెస్ పట్ల సుకుమార్ గారు ఎంతో ప్రౌడ్ గా ఉన్నారని చెప్పుకొచ్చాడు. ఇక నిర్మాతగా బీవీఎస్ఎన్ ప్రసాద్ గారిని సుకుమార్ గారు సెలెక్ట్ చేయగా.. ఈ సినిమాకి హీరోయిన్గా సంయుక్త మీనన్ ని నేను సెలెక్ట్ చేశానని తాజాగా పేర్కొన్నాడు కార్తీక్ దండు.
ఇక విరూపాక్ష సక్సెస్ తో ఈ దర్శకుడితో సినిమాలు చేయడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు. అయితే ఇప్పటివరకు తాను ఎవరి దగ్గర నెక్స్ట్ మూవీకి అడ్వాన్స్ తీసుకోలేదని వెల్లడించాడు ఈ దర్శకుడు. ఇక ప్రస్తుతం థియేటర్లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న విరూపాక్ష మూవీ విడుదలైన నాలుగు రోజులకే బ్రేక్ ఈవెంట్ టార్గెట్ పూర్తి చేసుకుని లాభాల బాట పట్టింది. తాజాగా ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయింది. ఇక సాయి ధరంతేజ్ కెరీర్ లోనే ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. శ్రీ వెంకటేశ్వర సినీ సినీ చిత్ర బ్యానర్ పై బి వి ఎస్ ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించగా, అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: