రామ్ చరణ్ డైరెక్టర్ తో సాయి తేజ్ నెక్స్ట్ మూవీ..?

Anilkumar
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తాజాగా 'విరూపాక్ష' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సాలిడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 21న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దుమ్ములేపుతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే 50 కోట్ల క్లబ్ లో చేరి అందరిని ఆశ్చర్యపరిచింది. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించాడు. ఇక తెలుగులో భారీ హిట్ అవడంతో ఈ మూవీని ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ  సక్సెస్ అవడం తో సాయి తేజ్ ఈ సక్సెస్ ని ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక మే 5న  విరూపాక్ష హిందీ వర్షన్ ని కూడా విడుదల చేయబోతున్నారు.

దానికి తగ్గట్టే పాన్ ఇండియా లెవెల్ లోనే ప్రమోషన్స్ని సైతం ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగారు సాయి ధరంతేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రచ్చ మూవీ ఫేమ్ సంపత్ నందితో లాక్ అయినట్టు తెలుస్తోంది. తాజాగా విరూపాక్ష సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ సెషన్ నిర్వహించాడు తేజు. ఇందులో భాగంగా ఒక అభిమాని సాయి తేజ్ ని ఓ మాస్ సినిమా చేయొచ్చుగా అని అడిగాడు. దానికి తేజు ఆన్సర్ ఇస్తూ.. ఏంటి సంపత్ నంది సిద్ధమేనా? అంటూ ట్యాగ్ చేయడం.. అతను కూడా వెంటనే లైన్ లోకి వచ్చి ఓకే అన్నట్టు సిగ్నల్ ఇచ్చాడు. దీంతో తేజు నెక్స్ట్ మూవీ సంపత్ నందితోనే ఉండబోతున్నట్టు స్పష్టమవుతుంది.

అయితే ఈ ప్రాజెక్ట్ ని ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ అయినప్పటికీ సాయిధరమ్ తేజ్ తాజాగా రివిల్ చేయడంతో ఫ్యాన్స్ ఇప్పుడు ఖుషి అవుతున్నారు. ఇక సంపత్ నంది గత కొన్నాళ్లుగా ఫామ్ లో లేడు. రామ్ చరణ్ తో తీసిన రచ్చ సక్సెస్ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో హిట్ రాలేదు. ఇటీవల ఈ డైరెక్టర్ తెరకెక్కించిన బెంగాల్ టైగర్, గౌతమ్ నంద, సిటీ మార్ ఏదీ కూడా హిట్ అవ్వలేదు. మధ్యలో రైటర్ గా నిర్మాతగా పలు సినిమాలు చేసిన డైరెక్టర్ గా మాత్రం ఇంకా సక్సెస్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. దీంతో ఈసారి సాయి ధరంతేజ్ తో ఓపక్క మాస్ మసాలా మూవీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పుడు విరుపాక్ష భారీ హిట్ అవ్వడంతో తేజు నెక్స్ట్ మూవీ పై ఎక్స్పెక్టేషన్స్ హై రేంజ్ లో ఉన్నాయి.మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా సంపత్ నంది తేజుతో ఎలాంటి సినిమా చేస్తాడనేది చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: