మహేష్-రాజమౌళి మూవీలో ఊహించని ట్విస్ట్..!?

Anilkumar
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా మంచి గుర్తింపును తెచ్చుకున్న రాజమౌళి గతేడాది మార్చి 25న విడుదలైన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో సెన్సేషన్ హిట్ అందుకొని పాన్ ఇండియా లెవెల్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. అంతేకాదు త్రిబుల్ ఆర్ సినిమా మల్టీ స్టార్ గా కూడా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది.వాటితో పాటు పలు అంతర్జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇక ఈ సినిమాలో హీరోలుగా నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును పొందారు. 

ఇక ఇంతటి విజయాన్ని అందుకున్న అనంతరం రాజమౌళి తన తదుపరి మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకు ఎక్కడా లేని విధంగా రాజమౌళి ఈ సినిమాను ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై రానటువంటి అంశంతో తీయబోతున్నాడు. ఇక ఈ విషయాన్ని ఇటీవల రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత రాజేంద్ర ప్రసాద్ వెల్లడించడం జరిగింది.మహేష్ బాబు నటించిన ఈ సినిమా ఆఫ్రికా బ్యాక్ గ్రౌండ్ లో అడ్వెంచర్ థ్రిల్లర్గా కొనసాగుతుందని ఆమధ్య రాజేంద్రప్రసాద్ చెప్పిన విషయం తెలిసిందే.

అయితే తాజా సమాచారం ప్రకారం ఇక్కడ మరొక ట్విస్ట్ కూడా ఉందని తెలుస్తోంది. ఇక అదేంటంటే అది కూడా ఒక స్టార్ హీరోని ఆయన సినిమాలో తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త కాస్త  వైరల్ గా మారుతుంది. ఇక మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 28వ సినిమా పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే రాజమౌళి తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక రాజమౌళి మహేష్ కాంబినేషన్లో రానున్న సినిమా కోసం ఇండియన్ ప్రేక్షకులే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న ఎందరో సినీ ప్రేక్షకులు సైతం ఎదురుచూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: