ఖైదీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన హీరో..?

Anilkumar
కోలీవుడ్ హీరో కార్తీ తన ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. తాను నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఖైదీ సీక్వెల్ పై తాజాగా క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్ లో మాట్లాడిన కార్తి.. ఈ మేరకు ఖైదీ సీక్వెల్ పై హింట్ ఇచ్చాడు. ఇక ఖైదీ సీక్వెల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కార్తీ అప్డేట్ తో ఫుల్ ఖుషి అవుతున్నారు. కార్తీ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో 2019లో వచ్చిన ఖైదీ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. కోలీవుడ్ తో పాటు తెలుగులోనూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో ఢిల్లీ పాత్రలో కార్తీ తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమా రిలీజ్ టైం లోనే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. 

అప్పటినుంచి ఖైదీ మూవీ సీక్వెల్ ఎప్పుడు వస్తుందని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా కార్తీ మణిరత్నం తెరకెక్కించిన 'పొన్నియన్ సెల్వన్ 2' సినిమాలో నటించాడు. ఫ్యాన్ ఇండియా లెవెల్ లో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో కార్తీ 'పొన్నియన్ సెల్వన్ 2' గురించి మొదటగా మాట్లాడారు. కార్తీ మాట్లాడుతున్నంతసేపు అక్కడున్న ప్రేక్షకులంతా ఢిల్లీ, ఢిల్లీ అంటూ కేకలు పెట్టారు. అది గమనించిన మన కార్తి ఖైదీ-2 త్వరలో ఉంటుంది అంటూ చెప్పాడు. ఇక ఈ అప్డేట్ తో అటు కార్తీ ఫ్యాన్స్, ఖైదీ మూవీ లవర్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే ఖైదీ సీక్వెల్ ఇప్పుడప్పుడే వచ్చే ఛాన్సెస్ అయితే లేవు.

ఎందుకంటే ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దళపతి విజయ్తో 'లియో' అనే మూవీని తెరకెక్కించే పనిలో చాలా బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు కంప్లీట్ అవ్వడానికి కనీసం రెండు సంవత్సరాలైనా పడుతుంది. కాబట్టి కార్తీ ఖైదీ సీక్వెల్ రావాలంటే మరో రెండు, మూడు సంవత్సరాలైనా ఆగాల్సిందే. ఇక కార్తీ నటించిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ వన్ గత ఎడాది విడుదలై కోలీవుడ్లో లో భారీ విజయాన్ని అందుకుంది. ఇక దానికి కంటిన్యూగా పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 వస్తుంది. ఇక ఈ సినిమాలో కార్తీతోపాటు విక్రమ్, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, శోభిత ధూళిపాళ్ల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: