ఆ సినిమా కోసం మరోసారి అలాంటి ప్రయోగం చేస్తున్న రామ్ చరణ్..!?

Anilkumar
ఒకప్పటి సినీ హీరోలు చాలామంది కథ విన్నామా స్టోరీ నచ్చిందా సినిమా చేసామా అన్నట్లుగానే ఉండేవారు. వాటితో పాటు డైరెక్టర్ కోసం ప్రొడ్యూసర్ కోసమో సినిమాలో చేయడానికి చాలామంది హీరోలు ఒప్పుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు ఒక సినిమా ఓకే చేయాలి అంటే చాలా ఆలోచిస్తున్నారు. స్టోరీ నచ్చిందా డైరెక్టర్ ఓకేనా అన్న తరహా లోనే కాకుండా ప్రతి విషయంలోనూ ఆజీతోచి అడుగులో వేస్తూ దానికి తగ్గ జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ముఖ్యంగా తమ అభిమానులకు ప్రజలకు సినిమా నచ్చేలా వారికి తొందరగా దగ్గర అయ్యేలా సినిమాలను చేసే దిశగా వెళుతున్నారు. 

తెలుగుతోపాటు అన్ని రకాల భాషలను నేర్చుకుంటున్నారు ఇప్పుడున్న చాలామంది హీరోలు.ఈ క్రమంలొనే చాలామంది హీరోలు తెలంగాణ స్లాంగ్ నేర్చుకుంటున్నారు.కానీ మరికొందరు హీరోలు మాత్రం ఉత్తరాంధ్ర స్లా0గ్ ను నేర్చుకునే పనిలో పడ్డారు. అయితే ఇప్పటివరకు చాలామంది హీరోలు ఈ ప్రయోగాలను చేశారు. అయితే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ లిస్టులోకి చేరాడు. ఆయన హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో గోదావరి భాషను మాట్లాడాడు. కానీ ఈసారి మాత్రం ఆయన నటిస్తున్న మరో కొత్త సినిమాలో ఉత్తరాంధ్ర స్లాగ్ ను నేర్చుకునే పనిలో ఉన్నాడట రామ్ చరణ్. అయితే ఇప్పటివరకు రామ్ చరణ్ ఇలాంటి ప్రయోగం చేసింది లేదు.

ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్సి 15 సినిమా పనిలో బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా అనంతరం బుచ్చిబాబు దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు రామ్ చరణ్.ఇక ఆ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో రానుంది. ఇక ఆ సినిమాలోని రామ్ చరణ్ ఉత్తరాంధ్ర స్లైన్లో మాట్లాడుతాడట. అంతేకాదు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినట్టుగానే ఈ సినిమా కథ కూడా ఉంటుందట. గతంలో రంగస్థలం సినిమాలో గోదావరి భాషలో మాట్లాడే ఆకట్టుకున్న రామ్ చరణ్ ఈసారి మాత్రం ఉత్తరాంధ్ర భాషలో మరోసారి ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. భాషతోపాటు ఈ సినిమాలో తన లుక్ కూడా చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: