ఉపాసన ధరించిన ఈ పింక్ డ్రెస్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Anilkumar
మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయాన్ని మెగా ఫ్యామిలీ మెంబర్స్ అధికారికంగా ప్రకటించినప్పటి నుండి ఫ్యాన్స్ అయితే తెగసందడి చేస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీ కూడా ఈ సమయంలో ఉపాసనకి ప్రతి సెలబ్రేషన్ ని చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. ముఖ్యంగా ఉపాసన ఫ్రెండ్స్, కజిన్స్ ఇటీవల నిర్వహించిన బేబీ షవర్ ఫోటోలు ఎంతలా వైరల్ అయ్యాయో తెలిసిందే. రామ్ చరణ్, ఉపాసన స్నేహితులు స్మితారెడ్డి, సరిన్ కట్ట తాజాగా ఉపాసనకి ఇంటిమేట్ బేబీ షవర్ ని నిర్వహించారు. ఇక ఈ బేబీ షుగర్ కి అల్లు అర్జున్, కనిక కపూర్, సానియా మీర్జా ఇతర సన్నిహితులు, ఫ్యామిలీ మెంబర్స్ హాజరయ్యారు. 

ఇక ఈ ఈవెంట్ కోసం ఉపాసన గులాబీ రంగు గౌన్లో తన బేబీ బంప్ ను ప్రదర్శిస్తూ కనిపించిన విషయం తెలిసిందే.అయితే ఉపాసన ధరించిన ఆ పింక్ గౌన్ కాస్ట్ ఇప్పుడు ఫాన్స్ లో హాట్ టాపిక్ గా మారుతుంది. తాజాగా ఉపాసన ధరించిన పింక్ డ్రెస్ ధర 90,000.. డీప్ వీనేక్ తో షార్ట్ స్లీవ్స్ తో ఉన్న ఈ పింక్ గౌన్ నీడిల్ త్రెడ్ బ్రాండ్ కు చెందింది. దీని ధర 1102 డాలర్లు. అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల 90,471 (టాక్స్ లన్ని కలిపి). దీంతో ప్రస్తుతం ఉపాసన పింక్ గౌను కు సంబంధించి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ వేడుకకే కాదు దీని కంటే ముందు దుబాయ్ లో జరిగిన బేబీ షవర్ వేడుకకి అలాగే చిరంజీవి ఇంట్లో జరిగిన సీమంతం వేడుక కూడా..

ఉపాసన బ్రాండెడ్ డ్రెస్లను ధరిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక ప్రస్తుతం ఉపాసనకి 7 నెలలు కాగా.. మరో రెండు నెలల్లో ఆమె పండంటి బిడ్డకి జన్మనివ్వబోతున్నారు. దీంతో మెగా ఫాన్స్ అంతా రామ్ చరణ్, ఉపాసన దంపతులకు వారసుడు పుట్టాలని కోరుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ఏడు నెలల ప్రెగ్నెంట్ తో ఉన్న ఉపాసన కోసం రామ్ చరణ్ తన షూటింగ్స్ కి కూడా బ్రేక్ ఇచ్చాడు. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సంచలన దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కంప్లీట్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతోంది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: