NBK108: 62 ఏళ్ల వయసులో కూడా బాలయ్య ఆ పని చేస్తున్నాడా..?

Anilkumar
నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 'NBK108' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో శరవేగంగా జరుగుతోంది. తాజా షెడ్యూల్లో బాలయ్య పై హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. స్టంట్ మాస్టర్ వెంకట్ సారధ్యంలో ఈ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు రెండు వారాలపాటు ఈ షెడ్యూల్ జరగనుందట. అయితే యాక్షన్ సన్నివేశాల్లోని పలు రిస్కీ షాట్స్ లో ఎటువంటి డూప్ లేకుండా యాక్ట్ చేస్తున్నారట బాలయ్య. 62 ఏళ్ల వయసులో కూడా డూప్ లేకుండా ఇలాంటి రిస్కీ షాట్స్ చేయడం అంటే నిజంగా విశేషమనే చెప్పాలి.

షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. సినిమాలో కాజల్ ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుందట. అలాగే మరో హీరోయిన్ శ్రీ లీల ఈ సినిమాలో బాలయ్యకి కూతురుగా కనిపించనుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య గతంలో ఎన్నడూ కనిపించని సరికొత్త లుక్స్ లో కనిపిస్తారట. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలయ్య మొత్తం మూడు గెటప్స్ లో కనిపిస్తారట. అందులో ఓ గెటప్ లో ఏకంగా 62 ఏళ్ల వ్యక్తిగా ఈ సినిమాలో బాలయ్య కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ 60 ఏళ్ల వ్యక్తి లుక్ మాత్రం సినిమాకి హైలెట్ గా ఉండబోతుందట.

అలాగే అటు మిడిల్ ఏజ్డ్ పర్సన్ గా కూడా బాలయ్య కనిపిస్తాడని అంటున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో బాలయ్య 60 ఏళ్ల పాత్రలో కనిపిస్తాడనే వార్త బయటకు రావడంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. అనిల్ రావిపూడి బాలయ్యతో ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని అర్థమవుతుంది. ఈ సినిమాలో బాలయ్య కాళీమాత భక్తుడిగా కూడా కనిపిస్తారట. మొత్తం మీద ఇప్పటివరకు సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి. బాలయ్య లో ఉన్న మాస్ యాంగిల్ ని బయటకు తీస్తూనే దానికి తనదైన శైలిలో కామెడీ తో పాటు పలు కమర్షియల్ అంశాలను జోడించి అనిల్ రావిపూడి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: