అవతార్ రేంజ్ లో ఆదిపురుష్ ఉంటుంది: ఓం రౌత్

Anilkumar
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో 'ఆది పురుష్' మూవీ ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో మొట్టమొదటిసారి ప్రభాస్ శ్రీరాముడిగా కనిపించబోతున్నాడు. అలాగే బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. సుమారు 400 కోట్ల భారీ బడ్జెట్ తో టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిజానికి ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కావలసిన ఈ మూవీ పలు అనువార్య కారణాలవల్ల జూన్ 16న వాయిదా పడింది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న వేళ మూవీ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించేశారు. 

ఈ క్రమంలోనే తాజాగా చిత్ర దర్శకుడు ఓం రౌత్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలియజేశారు. తమకు దొరికిన ఐదారు నెలల సమయాన్ని ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్ కోసం కేటాయించామని, సినిమాని మరింత అందంగా తీర్చిదిద్దడం కోసం సమయాన్ని ఉపయోగించమని చెబుతున్నాడు దర్శకుడు. తాజాగా ఓం రౌత్ మాట్లాడుతూ..' బీసీ కామిక్స్, మార్వెల్ మూవీస్, అవతార్ రేంజ్ లో ఆది పురుష్ విజువల్ ఎఫెక్ట్స్ ని ఉపయోగించాం. ఈ విజువల్ ఎఫెక్ట్స్ ని మరింత నాణ్యంగా తీర్చిదిద్దేందుకు మాకు అదనంగా ఐదారు నెలల సమయం దొరికింది. ఈ సమయాన్ని కేవలం విఎఫ్ఎక్స్ స్టూడియోలకే కేటాయించాం. రేపు థియేటర్లో ఆదిపురుష్ మూవీని చూసినంత సేపు ఓ భారీ హాలీవుడ్ సినిమా చూసిన అనుభూతిని కచ్చితంగా పొందుతారు' అని చెప్పుకొచ్చాడు.

దర్శకుడు ఇక ఓంరౌత్ మాటలను బట్టి చూస్తే ఆదిపురుష్ మూవీ పై టీమ్ అంతా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు అర్థమవుతుంది. నిజానికి ఈ సినిమా నుంచి ఆ మధ్య విడుదలైన టీజర్ ఎంతో నెగెటివిటీని మూట కట్టుకుంది. ముఖ్యంగా టీజర్ లో వీఎఫ్ ఎక్స్ చాలా దారుణంగా ఉన్నాయంటూ టీజర్ పై, దర్శకుడి పై భారీ విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా ఆది పురుష్ అప్డేటెడ్ టీజర్ ని విడుదల చేస్తే అందులో ఉన్న విఎఫ్ఎక్స్ కాస్త బెటర్ గానే అనిపించింది. దీంతో మళ్లీ ఆడియన్స్ లో ఫాన్స్ లో ఆదిపురుష్ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ సైఫలీ ఖాన్ రావణుడిగా నటిస్తుండగా.. సన్నీ సింగ్ లక్ష్మణుడిగా అలాగే దేవ దత్త నగే ఆంజనేయుడు పాత్రలో కనిపించనున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: