మరో మలయాళ రీమేక్ ని లైన్ లో పెట్టిన అల్లు అరవింద్..?

Anilkumar
టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఇప్పుడు మరో రీమేక్ ని లైన్ లో పెట్టారు. ఈసారి మరో నిర్మాత బన్నీ వాస్ తో కలిసి ఓ మలయాళ మూవీ ని తెలుగులో అందించబోతున్నారు అల్లు అరవింద్. ఇక అందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మలయాళంలో ఇటీవల సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ 'నయట్టు'.ఈ సినిమా మలయాళం లో చాలా పెద్ద హిట్ అయింది. ఇందులో బోజు జార్జ్ ప్రధాన పాత్ర పోషించాడు. ఇక ఈ సినిమాని అల్లు అరవింద్ బన్నీ వాస్ తో కలిసి తెలుగులో నిర్మిస్తున్నారు. ఇక మలయాళం లో భోజు జార్జ్ పాత్రను తెలుగులో సీనియర్ హీరో శ్రీకాంత్ పోషిస్తున్నాడని తెలుస్తోంది. ఇది ఒక పోలీస్ డ్రామా. మలయాళ మేకర్స్ ఈ డ్రామాని చాలా బాగా తీశారు. 

అయితే తెలుగులో ఏమైనా మార్పులు చేర్పులు చేసి తీస్తారా? లేక ఒరిజినల్ ని అలాగే తీస్తారా? అనేది చూడాలి. అయితే ఈ రీమేక్ కి తెలుగులో 'కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్' అనే టైటిల్ని కూడా ఫిక్స్ చేశారట మేకర్స్. మొదట ఈ రీమేక్ ని పెద్ద నటీనటులతో మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాగా తీయాలని ప్లాన్ చేశారు. కానీ అంత బడ్జెట్ ఎందుకు, చిన్న బడ్జెట్ లోనే తీస్తే బాగుంటుందని నిర్మాత అల్లు అరవింద్ చిన్న నటీనటులతో తీస్తున్నారట. ఇక ఈ రీమేక్ మూవీలో జీవిత రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ ఓ కీలక పాత్ర పోషిస్తుండగా.. ఫైట్ మాస్టర్ విజయ్ కొడుకు రాహుల్ మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ మలయాళ రీమేక్ లో ఒక మహిళా పోలీస్ అధికారి పాత్ర కూడా చాలా కీలకం.

తెలుగులో ఆ పాత్ర కోసమని వరలక్ష్మి శరత్ కుమార్ ని సెలెక్ట్ చేశారట. ప్రస్తుతం సైలెంట్ గా ఈ మూవీ షూటింగ్ అరకు చుట్టుపక్కల ప్రాంతంలో జరుగుతున్నట్లుగా సమాచారం వినిపిస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ రీమేక్ గురించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. మలయాళం లో ఈ మూవీ విడుదలైన వెంటనే గీతా ఆర్ట్స్ రీమేక్ రైట్స్ ని తీసుకున్నారు. దీంతో గత సంవత్సరమే రీమేక్ ని స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ బడ్జెట్ సెట్ అవ్వక ఆగిపోయారు. ఆ తర్వాత దాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. అయితే ఇప్పుడు మాత్రం చిన్న బడ్జెట్లో ఈ రీమేక్ ని తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే నిర్మాత అల్లు అరవింద్ కు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: