'విరూపాక్ష' హిట్ తో భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన సాయి తేజ్.. ఒక్క సినిమాకి అన్ని కోట్లా..?

Anilkumar
మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తాజాగా 'విరూపాక్ష' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో తేజ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి వి ఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది.ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే 20 కోట్లకు పైగా షేర్ రాబట్టి దుమ్ము లేపింది. సాయి ధరంతేజ్ కెరియర్ లోనే భారీ ఓపెనింగ్స్ అందుకున్న సినిమా కూడా ఇదే కావడం విశేషం. 

సినిమాలో హారర్, సస్పెన్స్ ఎలివేషన్స్ పుష్కలంగా ఉండటంతో ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో విరూపాక్ష మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో సాయి తేజ్ తన రెమ్యునరేషన్ అమాంతంగా పెంచాడంటూ ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతుంది. లేటెస్ట్ ఫిలింనగర్ టాక్ ప్రకారం విరూపాక్ష సినిమా కంటే ముందు ఒక్కో సినిమాకి 8 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్న తేజు.. ఇకపై తన కొత్త సినిమాలకు ఏకంగా 15 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. అంటే ప్రస్తుతం తీసుకుంటున్న రెమ్యునరేషన్ కి రెట్టింపు అన్నమాట.

తేజ్ అంతలా డిమాండ్ చేయడానికి కారణం విరూపాక్ష మూవీతో అతని మార్కెట్ భారీగా పెరిగిపోయింది. కాబట్టి అటు ప్రొడ్యూసర్స్ కూడా ఈ మెగా హీరో అడిగిన మొత్తం ఇచ్చేందుకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదట. ఇక విరూపాక్ష హిట్టుతో సాయి తేజ్ తో సినిమా చేయడానికి నిర్మాతలు సైతం ఎంతో ఆసక్తిని చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవర్ స్టార్ తో కలిసి వినోదయ సీతం రీమేక్లో నటిస్తున్నాడు తేజు.కానీ ల్ ఇప్పటివరకు సోలోగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా కమిట్ అవలేదు.  ప్రస్తుతం విరూపాక్ష సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు ఈ మెగా మేనల్లుడు. చాలా గ్యాప్ తర్వాత సాయి తేజ్ కి భారీ సక్సెస్ రావడంతో అతని ఫ్యాన్స్ కూడా ఈ సక్సెస్ తో ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక సాయి తేజ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ త్వరలోనే బయటికి వచ్చే అవకాశం ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: