ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సైఫ్ అలీ ఖాన్..?

Anilkumar
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తారక్ సరసన జాన్వికపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ కనిపించనున్నాడు. ఎన్టీఆర్ తో పాటు తాజాగా సైఫ్ అలీ ఖాన్ సైతం షూటింగ్లో జాయిన్ అయ్యాడు. ఈ సినిమాలో కొరటాల శివ సైఫ్ అలీ ఖాన్ కోసం ఓ పవర్ఫుల్ రోల్ డిజైన్ చేశారట. తాజాగా సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ పోరాటాల శివ గురించి మాట్లాడుతూ పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు.. 'కొరటాల శివ తనకు మూడు గంటల పాటు ఈ స్క్రిప్ట్ వినిపించారని, ముఖ్యంగా తన రోల్ గురించి ఎంతో అద్భుతంగా చెప్పారని సైఫ్ అలీ ఖాన్ చెప్పుకొచ్చాడు. 

అంతేకాదు ఈ సినిమా కోసం కొరటాల శివ అద్భుతమైన ప్లానింగ్, సెటప్ చేశారని పేర్కొన్నాడు. ఇక ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ..'తారక్ వర్క్ విషయంలో ఎంతో ఫ్యాసినేట్ గా ఉన్నాడని చెప్పాడు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పానని సైఫ్ అలీ ఖాన్ పేర్కొన్నాడు. ఇక ఈ సినిమా కోసం సైఫ్ అలీ ఖాన్ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం ఏకంగా హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చేఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదల కానుంది.

ఇక ఈ సినిమాతోనే జాహ్నవి కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోంది. ఇక సినిమాలో ఎన్టీఆర్ జాన్వి కపూర్ ల మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా స్పెషల్ గా ఉండబోతున్నాయట. టాలీవుడ్ లో ఈ మూవీ కెరీర్ పరంగా జాహ్నవికాపూర్ కి కచ్చితంగా ప్లస్ అవుతుంది అని అంటున్నారు. ఈ సినిమా కనుక హిట్ అయితే జాన్వి కపూర్ కి టాలీవుడ్ లో వరుస ఆఫర్లు రావడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఇక హై వోల్టేజ్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యసుదా ఆర్ట్స్ బ్యానర్లపై కళ్యాణ్ రామ్, మిక్కిలి నేను సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: