లేడీ డైరెక్టర్ తో మూవీ చేయనున్న యాష్..?

Pulgam Srinivas
కన్నడ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ కొనసాగిస్తున్న యాష్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందినటు వంటి "కే జీ ఎఫ్ చాప్టర్ 1" మరియు "కే జీ ఎఫ్ చాప్టర్ 2" మూవీ లతో యాష్ ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే "కే జి ఎఫ్ చాప్టర్ 2" మూవీ విడుదల అయ్యి సంవత్సరం దాటిపోయినప్పటికీ యాష్ మాత్రం తన తదుపరి మూవీ ని ఇప్పటి వరకు ప్రకటించ లేదు. 

ఆ మధ్య కన్నడ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి నర్తన్ దర్శకత్వంలో యాష్ తన తదుపరి మూవీ చేయబోతున్నాడు అని మరి కొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలబడబోతుంది అని అనేక వార్తలు బయటకు వచ్చాయి. కాకపోతే ఇప్పటి వరకు ఈ కాంబినేషన్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలబడలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ దర్శకుడి నెక్స్ట్ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

అసలు విషయం లోకి వెళితే ... గీతూ మోహన్ దాస్ అనే లేడీ డైరెక్టర్ దర్శకత్వంలో రూపొంద పోయే సినిమాలో యాష్ నటించబోతున్నట్లు ... ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో రూపొందించబోతున్నట్లు ... వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందబోయే మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే వెలబడ బోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . యాష్ తదుపరి మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఆయన అభిమానులు చాలా రోజులుగా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: