ఈవారం ... వచ్చేవారం విడుదల కాబోయే సినిమాల రన్ టైమ్ లు ఇవే..!

Pulgam Srinivas
ఈ వారం మరియు వచ్చే వారం విడుదల కాబోయే కొన్ని క్రేజీ సినిమాలు ఇప్పటికే తమ సినిమాల యొక్క రన్ టైమ్ లను లాక్ చేశాయి. అలా ఈ వారం ... వచ్చే వారం విడుదల కాబోయే సినిమాలు ఎంత రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయో తెలుసుకుందాం.
విరూపాక్ష : సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఏప్రిల్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ మూవీ 2 గంటల 20 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
కిసీ కా భాయ్ కిసీ కా జాన్ : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందిన ఈ మూవీ ఏప్రిల్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ మూవీ 2 గంటల 25 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ... భూమిక చావ్లా ... జగపతి బాబు కీలక పాత్రలలో నటించారు.
ఏజెంట్ : అక్కినేని అఖిల్ హీరో గా సాక్షి వైద్య హీరోయిన్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఏప్రిల్ 28 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల కానుంది. ఈ మూవీ 2 గంటల 30 నిమిషాల నిడివి తో  ప్రేక్షకుల ముందుకు రానుంది.
పొన్నియన్ సెల్వన్ : మణిరత్నం దర్శకత్వంలో చియాన్ విక్రమ్ ,  కార్తీ ,  జయం రవి ,  ఐశ్వర్య రాయ్ ,  త్రిష ,  శోభితా ధూళిపాల ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ మూవీ ఏప్రిల్ 28 వ తేదీన తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల కానుంది. ఈ మూవీ 2 గంటల 45 నిమిషాలకు నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: