"ధమాకా" మూవీకి మొదటిసారి వచ్చిన "టిఆర్పి" రేటింగ్ ఇదే..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ పోయిన సంవత్సరం చివరన ధమాకా మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించగా ... యంగ్ బ్యూటీ శ్రీ లీల ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ సరసన హీరోయిన్ గ నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. అలాగే ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర లభించాయి. ఇలా థియేటర్ లలో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే బుల్లి తెరపై ప్రసారం అయింది.

ఈ మూవీ కి బుల్లి తెరపై కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 10.08 "టి ఆర్ పి" రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా చూసుకుంటే ధమాకా మూవీ కి బుల్లి తెరపై అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఈ మూవీ కి బీమ్స్ సంగీతం అందించాడు. బీమ్స్ ఈ మూవీ కి అందించిన సంగీతం కూడా ఈ మూవీ విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది.

ఈ మూవీ లో రావు రమేష్ ... ఆది ముఖ్య పాత్రలలో నటించారు. రవితేజ తాజాగా రావణాసుర అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. ఈ మూవీ లో టాలీవుడ్ హీరో సుశాంత్ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... సుదీర్ వర్మ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: