సమంత కు గట్టి షాక్ ఇచ్చిన లారెన్స్...!!

murali krishna
ఈవారం సమంత హీరోయిన్గా నటించిన శాకుంతలం సినిమాతో పాటుగా రాఘవ లారెన్స్ హీరోగా నటించిన రుద్రుడు సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

సమంత హీరోయిన్ గా నటించిన శాకుంతలం సినిమాని గుణశేఖర్ డైరెక్ట్ చేయగా రాఘవ లారెన్స్ హీరోగా నటించిన రుద్రుడు సినిమాని కదిరేషన్ డైరెక్ట్ చేసి స్వయంగా నిర్మించారని తెలుస్తుంది.

ఇక సమంత శాకుంతలం సినిమాని దిల్ రాజు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా భారీ ఎత్తున అయితే విడుదల చేశారు. ఇక ఈ సినిమాను తమిళ, మలయాళ, కన్నడ అలాగే హిందీ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల చేసారు.. శకుంతల, దుష్యంతుల ప్రేమ కథతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి డివైడ్ టాక్ అందుకుంటుంది. ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైన సమంత శాకుంతలం సినిమాకి ఎక్కువ క్రేజ్ ఉంటుందని అందరూ కూడా అనుకున్నారు.

సమంత సినిమా పాన్ ఇండియా సినిమానే అయినా తెలుగు ప్రేక్షకులు మాస్ ఏరియాలలో ఈ సినిమా చూడటం కంటే రుద్రుడు సినిమా చూడడం బెటర్ అని ఆ సినిమా చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ట్రేడ్ వర్గాల వారి అంచనా ప్రకారం సమంత శాకుంతలం సినిమా చూసేందుకు కంటే రుద్రుడు సినిమా చూసేందుకు ఆసక్తి చూపించిన వారు చాలా ఎక్కువగా ఉన్నారట. అయితే సమంత శాకుంతలం సినిమాతో పాటు రాఘవ లారెన్స్ రుద్రుడు సినిమాకి కూడా అంత పాజిటివ్ రెస్పాన్స్ అయితే రాలేదని చెప్పాలి.

ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను అంతగా అలరించక పోయిన సమంత సినిమాతో పోల్చుకుంటే రుద్రుడు మాత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోందని సమాచారం.. సమంత సినిమా పూర్తి స్థాయి క్లాస్ సినిమా కాగా రుద్రుడు సినిమా మాత్రం మాస్ సినిమా. అయితే మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయనే సంగతి మీద ఆధారపడి రెండు సినిమాలు భవిష్యత్ ఉంటుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: