ఔట్ ఫిట్ అందాలతో అదరహో అనిపిస్తున్న నిహారిక.. ఫొటోస్ వైరల్..!

Divya
టాలీవుడ్ హీరో మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు కూతురు నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .. ముందుగా యాంకర్ గా తన కెరీర్ను ప్రారంభించిన ఈ అమ్మడు ఆ తర్వాత పలు సినిమాలలో , వెబ్ సిరీస్లలో కూడా నటించింది. ఒక మనసు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఆ తర్వాత పలు సినిమాలలో కూడా నటించింది. తన అందం, అభినయంతో ఎంతో కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే సంపాదించుకుంది. ముద్దపప్పు ఆవకాయ అనే వెబ్ సిరీస్ ద్వారా మరింత క్రేజ్ ను సంపాదించుకుంది నిహారిక.

కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా కూడా తన టాలెంట్ను ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉంది. 2020  డిసెంబర్ 9న చైతన్యను  వివాహం చేసుకుంది. ఆ తర్వాత కూడా వరుస సినిమాలలో,  వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా ఉండేది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు కూడా సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో తెలియజేస్తూ ఉంటుంది. తాజాగా నిహారిక అదిరిపోయే ఔట్ఫిట్ లో దర్శనమిస్తూ.. కుర్రకారులకు హీట్ పుట్టించేలా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

డేనిమ్ వేర్ డ్రస్సులో హాట్ అండ్ స్టైలిష్ లుక్ తో మరింత రెచ్చిపోతుంది నిహారిక ట్రూ యాంగిల్ షేప్ లో ఉన్న వైట్ కలర్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని మరీ మత్తెక్కించే కళ్ళతో మాయ చేస్తోంది. ఈ  ఫోటోలు చూసిన నేటిజెన్లు సైతం పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది అభిమానులు మాత్రం తమ మనసులో మాటలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ప్రస్తుతం నిహారికకు సంబంధించి ఈ ఫోటోలు మాత్రం వైరల్ గా మారుతున్నాయి. అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి నిహారిక చైతన్య విడిపోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపైన మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: