రవితేజా ను వెంటాడుతున్న నెగిటివ్ ప్రచారం !

Seetha Sailaja

మాస్ మహారాజా గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న రవితేజా తన సినిమాల హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరసపెట్టి సినిమాలు చేయడం అతని అలవాటు. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడ రవితేజా తన పారితోషికం విషయంలో ఒక్క రూపాయి కూడ తగ్గించడు అన్నప్రచారం ఉంది.

వరస ఫ్లాప్ లు తరువాత రవితేజాకు ‘క్రాక్’ మూవీ మళ్ళీ ట్రాక్ లోకి తీసుకు వచ్చింది. అయితే ఆతరువాత వెనువెంటనే వచ్చిన రవితేజా సినిమాలు మళ్ళీ ఫ్లాప్ లుగా మారడంతో ‘క్రాక్’ మూవీ కేవలం ఒక లక్ అనుకున్నారు. అయితే అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ గత సంవత్సరం విడుదలైన ‘ధమాకా’ 100 కోట్ల సినిమాగా మారడంతో ఇక రవితేజాకు ఎదురు లేదు అనుకున్నారు అంతా.

అయితే లేటెస్ట్ గా విడుదలైన ‘రావణాసుర’ మాస్ మహారాజకు బ్లాక్ బష్టర్ హ్యాట్రిక్ హిట్ ఇస్తుంది అంటూ విపరీతమైన ప్రచారం చేసి ఊదరగొట్టారు. అయితే ఈసినిమాకు వెళ్ళిన సగటు ప్రేక్షకుడు 12 తలల రావణాసురుడు కాదు ఈసినిమా చూసిన వారికి 12 రోజుల వరకు తలపోటు వదలదు  అంటూ సోషల్ మీడియాలో జోక్స్ పేల్చారు. దీనితో రవితేజా కు ఒక హిట్ తరువాత మళ్ళీ వరస ఫ్లాప్ లు తప్పవు అంటూ కొందరు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. దీనికి కొన్ని ఉదాహరణలు కూడ చెపుతున్నారు.

గతంలో రవితేజా కు ‘రాజా ది గ్రేట్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వరసగా నాలుగు ఫ్లాప్ లు వచ్చాయి. ఇంక గతంలోకి వెళితే ఒక సక్సస్ తరువాత రవితేజా కు వరసగా అరడజను ఫ్లాప్ లు వచ్చిన ట్రాక్ రికార్డు కూడ ఉంది. ఈ సెంటిమెంట్ ను ఆధారంగా చేసుకుంటే రవితేజా నుండి ఈ సంవత్సరం రాబోతున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ ‘ఈగల్’ సినిమాల పరిస్థితి ఏమిటి అంటూ కొందరు రవితేజా యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: