నయనతార చేసిన పనికి.. రాశిఖన్నాకు బంపర్ ఆఫర్?

praveen
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో లేడీస్ సూపర్ స్టార్ గా కొనసాగుతుంది నయనతార. పెళ్లి చేసుకుని దాంపత్య జీవితాన్ని కూడా ఎంతో సంతోషంగా గడుపుతుంది. ఇక ఇటీవల కవల పిల్లలకు తల్లి అయింది అన్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత సినిమాలు మానేస్తుంది అంటూ వార్తలు వచ్చినప్పటికీ.. వాటన్నింటికీ కూడా చెక్ పెట్టే విధంగా వరుసగా సినిమా అప్డేట్ లను ఇస్తూనే ఉంది. ఇక ప్రస్తుతం నయనతార చేతిలో ఏకంగా తొమ్మిది సినిమాలు ఉన్నాయి అని చెప్పాలి. ఇలా వరుస సినిమాలతో బిజీ బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు ఏకంగా నయనతార చేసిన పనికి మరో హీరోయిన్ రాసి కన్నాకు లక్కీ ఛాన్స్ వచ్చిందట.

 తమిళంలో  శశికాంత్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఒక సినిమాలో నయనతార హీరోయిన్గా ఎంపికైంది. ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ కావడం గమనార్హం. ఇందులో మాధవన్, సిద్ధార్థ్ ముఖ్యపాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇటీవల అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే అనుకోని కారణాలతో నయనతార ఈ సినిమా నుంచి తప్పకుందట. ఇంకేముంది ఈ బంపర్ ఆఫర్ కాస్త రాశి కన్నా ను వరించింది అన్నది తెలుస్తుంది. ఇదిలా ఉంటే నయనతార తో పాటు ఈ సినిమాలో అటు రాశి కన్నా కూడా నటిస్తుందని మరో టాక్ కూడా వినిపిస్తుంది.

 ఇక ఈ సినిమాకు ది టెస్ట్ అనే టైటిల్ ని కూడా చిత్ర బృందం నిర్ణయించారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభమవుతుంది అన్నది తెలుస్తుంది. ఇకపోతే గతంలో నయనతార, రాశి కన్నా కలిసి అంజలి సిబిఐ అనే సినిమాలో నటించారు. ఇక ఇప్పుడు ది టెస్ట్ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతుందా లేదా నయనతార పాత్రలో రాశి కన్నా కనిపించబోతుందా అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. కథ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇకపోతే  రాశి కన్నా ఇటీవల ఫర్జీ అనే వెబ్ సిరీస్ లో నటించగా.. ఇది ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ వెబ్ సిరీస్ తర్వాత హిందీలో కూడా వరుసగా అవకాశాలు దక్కించుకుంటుంది రాశిఖన్నా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: