బాలయ్య పై షాకింగ్ కామెంట్స్ చేసిన లక్ష్మీ పార్వతి...!!

murali krishna
ఎన్టీఆర్ రెండో భార్య అయిన లక్ష్మీ పార్వతి  ఈ మధ్య కాలం లో బాలయ్య మరియు లోకేశ్  లపై ఎక్కువ గా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా ఒక సందర్భం లో లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.లక్ష్మీ పార్వతి ప్రస్తుతం వైసీపీకి అనుకూలం గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజా గా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ బాలయ్య మాట్లాడితే ఆరు నెలలైనా అర్థం కాదని కామెంట్లు కూడా చేశారు.
లోకేశ్ ఏమీ రాని దద్దమ్మ అంటూ లక్ష్మీపార్వతి సెటైర్లు కూడా వేశారు. లోకేశ్ పాదయాత్ర లో రోజుకో విధంగా కామెడీ చేస్తున్నాడని చెప్పుకొచ్చింది.ఒక్క చోట కూడా గెలవని లోకేశ్ జగన్ పై విమర్శలు చేస్తున్నారని టీడీపీ పరిస్థితి దిగజారిపోతుందని అంటూ ఆమె వెల్లడించారు. లోకేశ్ బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని తమ ప్రభుత్వ వైఫల్యాల ను లోకేశ్ అస్సలు చెప్పకపోతున్నాడ ని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు.
చంద్రబాబు పాపాలు పండిపోయాయని చంద్రబాబు సైకో అని  కూడా ఆమె అన్నారు. లోకేశ్ సోషల్ మీడియా లో పనికి మాలిన వెధవలు అలాగే కుక్కలను పోషిస్తున్నాడని లక్ష్మీ పార్వతి కామెంట్లు చేశారు. బాలయ్య ఏం మాట్లాడతారో ఆయనకే అస్సలు తెలియదని  బాలయ్య చేసిన కామెంట్లను అర్థం చేసుకోవడం ఆరు నెలలు అయిన సాధ్యం కాదని లక్ష్మీ పార్వతి అన్నారట.చంద్రబాబు ఐదు లక్షల కోట్ల రూపాయలను స్విట్జర్లాండ్ లో దాచారని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు.
లక్ష్మీపార్వతి కామెంట్ల కు సంబంధించి టీడీపీ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి మరి.లక్ష్మీపార్వతి అవకాశం వచ్చిన ప్రతి సందర్భం లో కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.. లక్ష్మీ పార్వతి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారని తెలుస్తుంది.. బాలయ్య మాత్రం లక్ష్మీ పార్వతిపై విమర్శలు చేయడాని కి ఆసక్తి చూపడం లేదనే విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: