ఓటీటీలో ఉపేంద్ర 'కబ్జా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Anilkumar
కన్నడ అగ్ర హీరో ఉపేంద్ర ఇటీవల నటించిన తాజా చిత్రం 'కబ్జా'. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాతో ఉపేంద్ర సిల్వర్ స్క్రీన్ పై కనిపించాడు. పాన్ ఇండియా లెవెల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఉపేంద్ర  తో పాటు కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ వంటి కన్నడ స్టార్స్ ఈ సినిమాలో కీలకపాత్రను పోషించారు. ఇక ఉపేంద్ర సరసన శ్రియ శరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. భారీ ప్రొడక్షన్ వాల్యూస్ తో పీరియాడికల్  యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకి ఆర్ చంద్రు దర్శకత్వం వహించారు. ఇక టీజర్, ట్రైలర్స్ తో ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ..

మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా కన్నడ తో పాటు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల అయింది. అయితే భారీ అంచనాలను విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలను మూటగట్టుకుంది. సినిమాకి కేజిఎఫ్ రేంజ్ ఎలివేషన్స్ ఇవ్వడం చాలా పెద్ద మైనస్ గా మారింది. దీంతో ఆడియన్స్ ని ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అటు కలెక్షన్స్ పరంగా కూడా బాగా నిరాశపరిచింది. కానీ లాంగ్ గ్యాప్ తర్వాత ఉపేంద్ర సిల్వర్ స్క్రీన్ పై కనిపించడం, సినిమాలో కొన్ని ఎలివేషన్ సీన్స్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. అయితే కేజిఎఫ్ సినిమాతో పోల్చుకోకుండా ఈ మూవీని చూస్తే ఖచ్చితంగా ఆకట్టుకునే అవకాశం ఉందని రివ్యూస్ కూడా వచ్చాయి.

ఇలాంటి తరుణంలో చాలామంది ఈ మూవీని థియేటర్లో మిస్సయిన ఆడియన్స్ ఓటిటి రిలీజ్ ఎప్పుడు అని ఆసక్తిగా ఎదురు చూడ సాగారు. ఇక తాజాగా ఆడియన్స్ నిరీక్షణకు తెరపడింది. కబ్జా మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో కబ్జా సినిమాను ఏప్రిల్ 14న స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారిక ప్రకటనను విడుదల చేశారు. సుమారు 110 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా కేవలం విడుదలైన 25 రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుండడం గమనార్హంగా మారింది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటులు పోసాని కృష్ణమురళి, కోట శ్రీనివాసరావు, కబీర్ దుహాన్ సింగ్ తదితరులు ముఖ్య భూమిక పోషించారు. అలాగే హీరోయిన్ తాన్యా హోప్ స్పెషల్ సాంగ్ లో కనిపించి ఆకట్టుకుంది. ఇక థియేటర్లో మెప్పించలేకపోయిన ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: