పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'వకీల్ సాబ్' సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!!

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇస్తూ నటించిన 'వకీల్ సాబ్' మూవీ ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీలో అమితాబచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పింక్ అనే సినిమాకి తెలుగు రీమేగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాగా.. తెలుగు నేటివిటికి తగ్గట్లుగా ఈ మూవీ స్క్రిప్ట్ లో మార్పులు, చేర్పులు చేశారు. ఎంసీఏ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ మాస్టర్ హిట్ గా నిలిచింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ మూవీ హిట్ తో పవన్ కళ్యాణ్ ఆ తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓ జి, వినోదయ సీతం రీమేక్ వంటి వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలన్నిటిని ఈ ఏడాది లోపు పూర్తి చేసి మళ్లీ రాజకీయాలతో బిజీ కావాలని పవన్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు వకీల్ సాబ్ సినిమాకు సీక్వెల్ ఉండబోతుందంటూ తాజాగా ఓ వార్త ఫిలిం సర్కిల్స్లో వినిపించిన విషయం తెలిసిందే. అయితే వకీల్ సాబ్ సీక్వెల్ గురించి దర్శకుడు వేణు శ్రీరామ్ క్లారిటీ ఇస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తో  సినిమా చేయడం కోసం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. అయితే వకీల్ సాబ్ తర్వాత అల్లు అర్జున్ తో ఐకాన్ ప్రాజెక్ట్ ను చేయాలని వేణు శ్రీరామ్ ప్లాన్ చేశారు.

కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. అయితే ప్రస్తుతం తాను మూడు స్క్రిప్టు లు రెడీ చేస్తున్నానని, అందులో వకీల్ సాబ్ సీక్వెల్ కూడా ఉందంటూ క్లారిటీ ఇచ్చాడు వేణు శ్రీరామ్. ఇక వకీల్ సాబ్ కన్నా సీక్వెల్ లో మాత్రం ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ చాలా ఉన్నాయి అంటూ చెప్పడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతూ అప్పుడే సీక్వెల్ పై భారీ అంచనాలను పెంచేసుకుంటున్నారు. ఇక వకీల్ సాబ్ కి కచ్చితంగా సీక్వెల్ ఉంటుందని చెప్పిన వేణు శ్రీరామ్ అది ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే విషయాన్ని చెప్పలేదు. వకీల్ సాబ్ సీక్వెల్ కి ఎప్పుడు ముహూర్తం ఫిక్స్ చేస్తారో తెలియదు కానీ కచ్చితంగా ఈ సీక్వెల్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ఫాన్స్ ఈ సందర్భంగా చెబుతున్నారు.బహుశా 2024 ఎన్నికల తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందేమో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: