ట్రైలర్: డిఫరెంట్ జోనర్లు అదరగొడుతున్న విరూపాక్ష ట్రైలర్..!!

Divya
మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష.. ఈ సినిమా ఈనెల 21న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించక మరొక డైరెక్టర్ కార్తీక్ దండు కూడా ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. దాదాపుగా ఎన్నో సంవత్సరాల తర్వాత సాయి ధరంతేజ్ నటిస్తున్న ఈ సినిమా కావడంతో మంచి హైప్ ఏర్పడుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ ట్రైలర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఇక తాజాగా ఎట్టకేలకు ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల కావడం జరిగింది. ఈ సినిమా ట్రైలర్ కు గెస్ట్ గా అల్లు అరవింద్, దిల్ రాజు రావడం జరిగింది.  ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే..2.5 నిమిషాల రన్ టైంలో వచ్చిన ఈ ట్రైలర్ రుద్రవరం అనే ఊరిలో వరస మరణాలు సంభవిస్తూ ఉంటాయి. అందుకు గల కారణాలు ఏంటి అనే విషయంపై కనుక్కోవడానికి హీరో సాయి ధరంతేజ్ ఆ ఊరికి వెళ్తారు.. ఆ ఊరిలోనే హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా నివసిస్తున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది .అలా వీరి మధ్య ప్రేమ కూడా ఏర్పడుతుంది.. ఇక ఊరిలో ఏర్పడిన సమస్య కారణంగా సాయి ధరంతేజ్ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాడో ఈ ట్రైలర్లు చూపించడం జరుగుతోంది.

ఇందులో కీలకమైన పాత్రలో సునీల్, బ్రహ్మాజీ ,అజయ్ ముఖ్యమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఒక డిఫరెంట్ జోనర్లు పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయబోతున్న ఈ చిత్రం సాయి ధరమ్ కెరియర్ లో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి మరి. వరుస సినిమాలతో సక్సెస్ మీద ఉన్న సంయుక్త మీనన్ ఈ సినిమాతో హ్యాట్రిక్ హీట్ కొడుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: