'జబర్దస్త్ ఆయన వల్లే మానేశాను'.. చమ్మక్ చంద్ర షాకింగ్ కామెంట్స్..?

Anilkumar
బుల్లితెర ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన చాలా మందిలో చమ్మక్ చంద్ర కూడా ఒకరు. ముఖ్యంగా లేడీ గెటప్ స్కిట్స్ తో బుల్లితెరపై భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు చంద్ర. మొదట్లో జబర్దస్త్ లోకి ఓ సాదాసీదా కంటెస్టెంట్ గా వచ్చిన చంద్ర.. ఆ తర్వాత తన కామెడీ టైమింగ్ తో టీం లీడర్ గా మారిపోయాడు. ఇక జబర్దస్త్ స్టేజిపై ఎన్నో స్కిట్స్ ద్వారా ఆకట్టుకున్న చంద్ర ఆ తర్వాత వెండితెరపై పలు సినిమాల్లోనూ నటిస్తూ తన కామెడీతో మంచి క్రేజ్ ను దక్కించుకున్నాడు. అయితే ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుండి జబర్దస్త్ నుంచి చమ్మక్ చంద్ర వెళ్ళిపోయాడు. 

ఆ తర్వాత జీ తెలుగులో అదిరింది అనే షోలో మళ్లీ టీం లీడర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత మాటీవీలో ప్రసారమైన కామెడీ షో లో కూడా చేశాడు. ఇక ఆ తర్వాత కొన్నాళ్లకు తిరిగి మళ్ళీ జబర్దస్త్ కి వచ్చారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్ర జబర్దస్త్ గురించి, తాను జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తను జబర్దస్త్ నుంచి బయటికి వెళ్లిపోవడానికి కారణం తన ఆరోగ్య సమస్యలే అని తెలిపాడు చంద్ర. ఇక జబర్దస్త్ సెట్లో నాగబాబు ప్రతి ఒక్కరిని ఎంతో ఎంకరేజ్ చేసే వారిని ప్రతి టీంలో ఏ కంటెస్టెంట్ బాగా చేశాడో వాళ్లని బాగా మెచ్చుకునేవారని అన్నాడు.

అయితే నేను కూడా మధ్యలో రెండు మూడు స్కిట్లు బాగా చేయకపోతే నాగబాబుగారు నన్ను పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చేవారు. ఇలా కాదు అలా చేయండి అంటూ ఎన్నో సలహాలు ఇచ్చేవారు. ఇక ప్రొడ్యూసర్ శ్యాం ప్రసాద్ రెడ్డి గారు అలాగే వారి కూతురు సెట్లో ఎవ్వరికి ఏం కావాలో చూసుకునేవారు. నాకున్న ఆరోగ్య సమస్యల కారణంగానే నేను జబర్దస్త్ నుంచి తప్పుకున్నాను తప్ప నాకు జబర్దస్త్ వారితో ఎటువంటి విభేదాలు అయితే లేవని క్లారిటీ ఇచ్చాడు. ఇక జబర్దస్త్ ద్వారా చాలామంది కమెడియన్స్ కి పాపులారిటీ వచ్చిందని  అంతేకాకుండా ఈరోజు జబర్దస్త్ లో కమెడియన్ గా చేసిన వాళ్లందరికీ సినిమా అవకాశాలు వెతుక్కుంటూ మరీ వస్తున్నాయని అందుకు కారణం జబర్దస్త్ అని చమ్మక్ చంద్ర చెప్పుకొచ్చాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: