పవన్ అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చిన రేణు దేశాయ్ !

Seetha Sailaja
లేటెస్ట్ గా జరిగిన అకిరా నందన్ పుట్టినరోజు సందర్భంగా రేణు దేశాయ్ పవన్ అభిమానులకు ఇచ్చిన కౌంటర్ వెనుక అర్థాలు ఏమిటి అంటూ కొందరు ఆమె మాటలలోని అర్థాలను వెతుకుతున్నారు. అకీరా పుట్టిన రోజు పుర‌స్క‌రించుకుని రేణూ ఒక వీడియోని పెట్టింది. ఈ వీడియోపై ప‌వ‌న్ అభిమాని పెట్టిన కామెంట్ రేణు దేశాయ్ కు ఆగ్ర‌హం తెప్పించినట్లుగా కనిపిస్తోంది.

‘మేడ‌మ్ ఒక్క‌సారైనా మా అకీరాని స‌రిగ్గా చూపించండి. మా అన్న కుమారుడిని చూడాల‌ని మాకెంతో ఆశ‌గా ఉంది" అని ప‌వ‌న్ అభిమాని కామెంట్ చేసాడు. ‘మా అకీరా మా అన్న కుమారుడు అన్న పదాలు రేణు దేశాయ్ కి ఆగ్రహాన్ని తెప్పించినట్లు కనిపిస్తోంది. "మీ అన్న కుమారుడా? అకీరా నా అబ్బాయి. మీరు వీరాభిమానులు అయి ఉండొచ్చు ముందు మాట్లాడటం  నేర్చుకోండి" అంటూ సున్నితంగా ఆ అభిమానికి చురకలు వేసింది.

అకిరా పవన్ కొడుకు అయినప్పటికీ అతడు తన కొడుకు మాత్రమే అన్న విషయాన్ని పవన్ అభిమానులకు గుర్తు చేయడానికి రేణు ఇలా కౌంటర్ ఇచ్చింది అనుకోవాలి. ఆమధ్య కొన్ని అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లుగా ఆమె గురించి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూ ఉండటంతో ఆమె అనారోగ్య సమస్యలు పూర్తిగా తగ్గిపోయాయి అనుకోవాలి.

ఇక సినిమాల విషయాలకు వస్తే పవన్ కళ్యాణ్ ను పెళ్ళి చేసుకున్న తరువాత సినిమాలకు దూరమైన ఆమె తిరిగి చాల సంవత్సరాల తరువాత ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీలో రవితేజాకు సోదరిగా నటిస్తోంది. ఆగష్టులో విడుదల కాబోతున్న ఈమూవీ ఊహించిన స్థాయిలో సక్సస్ అయితే తిరిగి రేణు దేశాయ్ కి మరిన్ని అవకాశాలు వచ్చి ఆ సెకండ్ ఇన్నింగ్స్ మొదలయ్యే ఆస్కారం ఉంది. ఆమధ్య ఒక డాన్స్ షోకు ఆమె జడ్జిగా వ్యవహరించినప్పటికీ అందులో ఆమెకు చెప్పుకోతగ్గ గుర్తింపు రాలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: