నాగచైతన్య వల్లే.. ప్రభాస్, అనుష్క మధ్య దూరం పెరిగిందా?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరో హీరోయిన్లు సినిమాల్లో జోడీలుగా నటించడం చూస్తూ ఉంటాం. అయితే ప్రేక్షకులకు మాత్రం ఇలా కొంతమంది హీరో హీరోయిన్ల జంటలే ఫేవరెట్ గా మారిపోతూ ఉంటాయి. ఇక ఆ కాంబినేషన్లో కొన్ని సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి అంటే చాలు ఇక ఆ జోడి ఏ సినిమాలో కనిపించినా కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఇలా తెలుగు ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న జోడిలలో ప్రభాస్, అనుష్క జంట ఒకటి.

 గతంలో ఎన్టీఆర్- సావిత్రి, చిరంజీవి- రాధిక, బాలకృష్ణ- సిమ్రాన్, వెంకటేష్ -సౌందర్య, నాగార్జున- టబు లాగానే ప్రభాస్ అనుష్క జంటకు సిల్వర్ స్క్రీన్ పై మంచి గుర్తింపు వచ్చింది. ఇక వీరి మధ్య కెమిస్ట్రీ అటు ప్రేక్షకులందరికీ కూడా బాగా కనెక్ట్ అయిపోయింది అని చెప్పాలి. ఇక వీరిద్దరూ ప్రేమించుకున్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ ఒక వార్త టాలీవుడ్ ఇండస్ట్రీని ఎన్నో రోజులపాటు ఊపేసింది. కానీ ఆ తర్వాత లావుగా మారిపోవడంతో అనుష్క సినిమాలకు దూరం అవ్వడం.. ఇక బాహుబలి తర్వాత అనుష్క ప్రభాస్ ఎక్కడ కలిసి కనిపించకపోవడంతో వీరి పెళ్లి వార్తలు కాస్త తక్కువ అయ్యాయి.

 అయితే అనుష్క, ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఒక యంగ్ హీరో అంటూ ఒక వార్త ఇప్పుడు తెరమీదకి వచ్చింది. అనుష్క, ప్రభాస్ లు విడిపోవడానికి అక్కినేని హీరో నాగచైతన్య కారణమట. ఎందుకంటే గతంలో అనుష్క నాగచైతన్య మధ్య లవ్ ఎఫైర్ ఉందని పబ్లిక్ గానే ఓ పత్రిక పేపర్లో వేసింది. దీంతో అప్పటి నుంచి ప్రభాస్ అనుష్కకు దూరంగానే ఉంటున్నాడట. ఇక అనుష్కతో కలిసి మరో సినిమా చేయకూడదని అనుకున్నాడట. కానీ బాహుబలి సమయంలో రాజమౌళి ఒత్తిడి చేయడంతో చివరికి అనుష్కతో  నటించేందుకు ఒప్పుకున్నాడట. కానీ ఇక ఇవేవీ బయటకు కనిపించకుండా ప్రమోషన్స్ లో వీరిద్దరూ స్నేహితుల్లాగానే నటించారని టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: