ఉపాసన కి అలియా భట్ సర్ప్రైజ్ గిఫ్ట్.. అది ఏంటంటే..?

Anilkumar
మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన ఇటీవల దుబాయ్ లో తన సీమంతం ఫంక్షన్ జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ వేడుకను ఉపాసన ఫ్రెండ్స్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఉపాసన సీమంతానికి బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఒక అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.. 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్గా పరిచయమైంది ఆలియా భట్. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయినప్పటికీ త్రిబుల్ ఆర్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించడానికి ఓకే చెప్పింది. 

ఇక ఈ సినిమాతో ఆమె పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇక ట్రిపుల్ఆర్ తర్వాత మళ్లీ ఇప్పటివరకు తెలుగులో నటించకపోయినప్పటికీ తెలుగు హీరోలైన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. ఇటీవల కాలంలో ఎన్టీఆర్ ఇద్దరు పిల్లలకి Ed-a-mamma అనే తన క్లాతింగ్ షో రూమ్ నుండి బట్టలు పంపింది. ఇక ఇప్పుడు తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసనకి కూడా ఆలియా భట్ సర్ప్రైజింగ్ గిఫ్ట్ ను పంపింది. ఇంతకీ సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఏంటంటే.. తన క్లాతింగ్ షోరూమ్ అయినా Ed-a-mamma నుండి ప్రెగ్నెన్సీ కి సంబంధించిన డ్రెస్సులు అలాగే పుట్టబోయే బేబీకి సంబంధించిన డ్రెస్ లను అలియా భట్ గిఫ్ట్ గా పంపించింది.

ఈ విషయాన్ని ఉపాసన స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఆలియా భట్ కి థాంక్స్ చెప్పింది. ప్రస్తుతం ఉపాసనకి ఆలియా భట్ పంపిన గిఫ్ట్ గురించి తెలుసుకున్న మెగా ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆలియా భట్ కి థాంక్స్ చెప్తున్నారు. అంతేకాకుండా మళ్ళీ తమ అభిమాన హీరో రామ్ చరణ్ తో తెలుగులో సినిమా తీస్తే బాగుంటుందంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.ఇక ప్రస్తుతం రామ్ చరణ్, ఉపాసన జంట దుబాయ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల ఉపాసనకి సీమంతం వేడుకతో పాటు బేబీ షవర్ కూడా అక్కడే జరిగింది. ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: