బుల్లితెరపై దుమ్ములేపిన ' ధమాకా'.. మాస్ రాజా మూవీకి భారీ టిఆర్పీ..?

Anilkumar
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే క్రాక్ తర్వాత రెండు ప్లాప్స్ ఎదుర్కొన్న రవితేజకు ఇటీవల 'ధమాకా' చిత్రం సంచలన విజయాన్ని అందించింది. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రవితేజ కెరియర్ లోనే 100 కోట్ల క్లబ్లో చేరిన ఏకైక సినిమాగా ధమాకా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.ఇక సినిమాలో రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, హీరోయిన్ శ్రీ లీల డాన్సులు, నటన, హైపర్ ఆది, రావు రమేష్ మధ్య కామెడీ ట్రాక్ స్పెషల్ హైలెట్స్ గా నిలిచాయి. ఇక సంగీత దర్శకుడు భీమ్స్ అందించిన పాటలు అయితే థియేటర్లను దద్దరిల్లేలా చేశాయి. 

ధమాకా ఆల్బమ్ మొత్తం చార్ట్ బస్టర్ గా ఇచ్చింది. ధమాకా సక్సెస్ లో ఎక్కువ క్రెడిట్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ కే దక్కుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక మూడు నెలల క్రితం ఓటీటీలో విడుదలై అక్కడ కూడా సంచలనం సృష్టించింది ఈ సినిమా. నెట్ ఫ్లిక్స్ లో వరుసగా రెండు వారాలు టాప్ 10 ట్రెండింగ్ లో నిలిచి ఓటీటీలోనూ అదరగొట్టింది. ఇక ఇప్పుడు తాజాగా బుల్లితెరపై కూడా దుమ్మురేపింది ధమాకా చిత్రం. బుల్లితెరపై ఈ సినిమా అనూహ్య రీతిలో టిఆర్పిని సొంతం చేసుకుంది. గత నెల చివరి వారంలో ప్రముఖ టీవీ ఛానల్ జెమినీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమైన ధమాకా చిత్రం..

ఏకంగా 10.08 ఎనిమిది టిఆర్పి రేటింగ్ సాధించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. నిజానికి ఈమధ్య థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్న సినిమాలు ఈ రేంజ్ టిఆర్పిని అందుకోలేకపోతున్నాయి. అలాంటిది మాస్ మహారాజా రవితేజ ధమాకా సినిమాతో ఈ ఫీట్ ను సాధించడం మామూలు విషయం కాదు. ఇక త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై వివేక్ కూచిబొట్ల, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ప్రముఖ రైటర్ ప్రసన్నకుమార్, బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. తనికెళ్ల భరణి, సచిన్ కడేర్కర్, రావు రమేష్, హైపర్ ఆది, పవిత్ర లోకేష్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: