బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మాస్ రాజా.. ఏకంగా ఆ స్టార్ హీరోతో మల్టీస్టారర్..?

Anilkumar
ప్రస్తుతం మన సౌత్ సినిమాలు నార్త్ లో కూడా సత్తా చాటుతున్నాయి. త్రిబుల్ ఆర్, కే జి ఎఫ్, పుష్ప, కార్తికేయ 2 లాంటి సినిమాలు సౌత్ లోనే కాకుండా నార్త్ ఆడియన్స్ సైతం ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీంతో బాలీవుడ్ మేకర్స్ దృష్టి ఇప్పుడు సౌత్ సినిమాల పై పడింది. ఈ క్రమంలోనే పలువురు బాలీవుడ్ ముద్దుగుమ్మలు మన తెలుగులో సినిమాలు చేసి సక్సెస్ అవ్వగా.. మరి కొంతమంది తమ లక్ ని టెస్ట్ చేసుకుంటున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా.. మన టాలీవుడ్ అగ్ర హీరోలు ఇప్పుడు బాలీవుడ్ బాట పడుతున్నారు. బాలీవుడ్ యాక్టర్స్ తో కలిసి ఎంటర్టైన్మెంట్ ని అందించేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. 

ఇప్పటికే రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన బ్రహ్మాస్త్రం సినిమాతో అక్కినేని నాగార్జున నార్త్ ఆడియన్స్ ని ఆకట్టుకోగా.. ఇప్పుడు కిసీకా భాయి కిసీకా జాన్ సినిమాతో విక్టరీ వెంకటేష్ నార్త్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నాడు. ఇదే సినిమాలో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సైతం గెస్ట్ రోల్లో కనిపించనున్నాడు. ఇక మరో అగ్ర హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'వార్ 2' చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఇక ఇప్పుడు ఇదే లిస్టులో మన మాస్ మహారాజా రవితేజ కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ బి టౌన్ టాక్ ప్రకారం బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి రవితేజ ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది.

దగ్గుబాటి హీరో రానా, కరణ్ జోహార్, ఏషియన్ మూవీస్ సునీల్ ఈ ప్రాజెక్టుని సంయుక్తంగా నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇటీవల నాగార్జునతో ఘోస్ట్ సినిమాని తెరకెక్కించిన టాలెంట్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారట. ఈ ఏడాది తృతీయార్థంలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్లో రవితేజ డబ్బింగ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. రవితేజ తెలుగులో నటించిన చాలా సినిమాలు హిందీలో డబ్ అయి అక్కడి ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు స్ట్రైట్ బాలీవుడ్ ఫిలిం చేస్తుండడంతో ఖచ్చితంగా ఈ ప్రాజెక్టుతో బాలీవుడ్లో రవితేజకు మంచి మార్కెట్ ఏర్పడుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: