'రావణాసుర' ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Anilkumar
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'రావణాసుర'.. స్వామి రారా ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 7 (ఈరోజు ) థియేటర్స్ లో విడుదలైంది. ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత రవితేజ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఇది థ్రిల్లర్ జోనర్ మూవీ కావడం సినిమాలో రవితేజ మొదటిసారి లాయర్ క్యారెక్టర్ తోపాటు నెగిటివ్ రోల్ చేయడంతో ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూశారు. ఇక ఈరోజు థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ వీకెండ్ రావణాసుర మూవీ తో థియేటర్లో ఆడియన్స్ ఎంటర్టైన్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. 

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ అప్డేట్ బయటికి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం రావణాసుర ఓటీటీ రైట్స్ ని ప్రముఖ టీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. భారీ రేటుకే ఈ మూవీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అలానే ఓటీటీ రిలీజ్ డేట్ పై కూడా అప్డేట్ వచ్చింది. రావణాసుర రిలీజ్ అయిన 5 నుంచి 6 వారాలకు ఓటీటీ లో అందుబాటులోకి రావచ్చని సమాచారం. ఇక ఓటిటి రైట్స్ ని ఆమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా.. టీవీ రైట్స్ ని జీ తెలుగు కైవసం చేసుకుంది. ఇక అభిషేక్ ఆర్ట్స్, RT టీం వర్క్స్ బ్యానర్స్ పై మాస్ మహారాజ రవితేజ, అభిషేక్ నామ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించగా..

పుష్ప మూవీ రైటర్ శ్రీకాంత్ విస్సా ఈ మూవీ కథను అందించారు. ఇక రవితేజ సరసన మేఘ ఆకాష్, అను ఇమ్మానుయేల్,పరియా అబ్దుల్లా, దక్ష నగార్కార్, పూజిత పొన్నాడ హీరోయిన్స్ గా నటించగా.. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇక ప్రస్తుతం రావణాసురతో థియేటర్స్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న మాస్ మహారాజ రవితేజ ఇదే ఏడాది దసరా కారకుగా తన మరో సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'ని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నాడు. వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. అన్నట్టు మాస్ మహారాజ రవితేజ కి ఇది మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం విశేషం...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: