బాలీవుడ్ లో రామ్ చరణ్ చేయబోతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ ఇవే..!!

Anilkumar
టాలీవుడ్ అగ్ర హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ట్రిపులర్  సినిమాతో గ్లోబల్ వైడ్ గా ఎలాంటి క్రేజ్ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం చెర్రీతో సినిమాలు చేయడానికి అగ్ర దర్శక నిర్మాతలు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే తన తోటి హీరో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ సినిమాలో నటించే ఛాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. బ్రహ్మాస్త్ర మూవీ ఫేమ్ ఈ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ తోనే ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. మరి ఎన్టీఆర్ సంగతి సరే? రామ్ చరణ్ సంగతేంటి? చరణ్ కి బాలీవుడ్ లో ఎటువంటి ఆఫర్స్ రావడం లేదా? అనే సందేహాలు అభిమానులు తలెత్తుతున్నాయి. 

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు రామ్ చరణ్ కూడా బాలీవుడ్ లో పలు క్రేజీ ప్రాజెక్ట్ లో నటించబోతున్నాడట. లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం బాలీవుడ్లో రాజ్ కుమార్ హిరానీ తో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడట. నిజానికి ట్రిపుల్ ఆర్ కంటే ముందే ఈ ప్రాజెక్టు సెట్ అయిందని చెబుతున్నారు. అయితే రాజ్ కుమార్ హిరానీ ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తో 'డుంకి' అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ తో ప్రాజెక్ట్ ని రాజకుమార్ హీరాని సెట్స్ పైకి తీసుకెళ్తాడట. బాలీవుడ్లో మున్నాభాయ్ ఎంబిబిఎస్, లగే రహో మున్నాభాయ్, 3 ఇడియట్స్, పీకే, సంజు ఇలా ఎన్నో సెన్సేషనల్ మూవీస్ ని తీశాడు ఈ దర్శకుడు.

ప్రతి సినిమా కూడా ఒకదానిని మించి మరొకటి సెన్సేషన్ హిట్ ని అందుకున్నాయి. అలాంటి డైరెక్టర్ తో ఇప్పుడు రామ్ చరణ్ బాలీవుడ్ ప్రాజెక్ట్ చేయబోతుండటం నిజంగా విశేషం అని చెప్పాలి. ఇక ఈ ప్రాజెక్టు తో పాటు మరో బాలీవుడ్ స్టార్ రైటర్ సిద్ధార్థ ఆనంద్ తో కూడా చెర్రీ ఓ సినిమా చేస్తున్నారట. అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఇంకా కథ చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అగ్ర దర్శకులతో క్రేజీ ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టి, బాలీవుడ్ లోను జెండా పాతాలని చూస్తున్నాడు రామ్ చరణ్. ఇక ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వచ్చేఏడాది ప్రధమర్థంలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: