విజయ్ దేవరకొండ తో సుకుమార్ మూవీ.. అవన్నీ నమ్మొద్దంటున్న చిత్ర యూనిట్..!!

Anilkumar
టాలీవుడ్ లెక్కల మాస్టారు సుకుమార్ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో 'పుష్ప 2' సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ఆడియన్స్ ఎంతో ఈగర్ గా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి పుష్ప రాజ్ గా విధ్వంసం సృష్టించడానికి రెడీ అవుతున్నాడు బన్నీ. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల అయ్యేందుకు ముస్తాబవుతోంది. చిత్ర యూనిట్ కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక ఈ సినిమా పూర్తవుకముందే సుకుమార్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. 

గతంలోనే ఈ కాంబినేషన్ కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. దీంతో ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్న ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఈ ప్రాజెక్టు మరుగున పడిపోయినట్లు ఫిలిం సర్కిల్స్లో టాక్ వినిపించింది. తాజాగా ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయినట్లు జోరుగా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఈ వార్తలపై మూవీ టీం ఎట్టకేలకు రెస్పాండ్ అయింది. సుకుమార్, విజయ్ దేవరకొండ మూవీని పక్కన పెట్టలేదని, వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టు పట్టాలెక్కించేందుకు మూవీ యూనిట్ రెడీ అవుతుందని..

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించబోతున్నట్లు తెలిపారు. దీంతో సుకుమార్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మూవీ కచ్చితంగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేయడంతో ఫ్యాన్స్ ఈ ప్రాజెక్టు కోసం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 2024 వేసవిలో సుకుమార్ విజయ్ దేవరకొండలో ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లి అవకాశం ఉంది. ఇక ఇటీవల లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ ని మూట కట్టుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' అనే సినిమాలో నటిస్తున్నాడు. స్టార్ హీరోయిన్ సమంత ఈ మూవీలో కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: