పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాతో నార్త్ లో బన్నీకి విపరీతమైన క్రేజ్ పెరిగింది ఇక పుష్ప ది రైస్ తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ బన్నీ ఇప్పుడు మరోసారి పుష్ప 2 తో సరికొత్త సంచలనానికి సిద్ధమవుతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప 2 కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ఆడియన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పుష్ప ది రైస్ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత పార్ట్ 2 పై భారీ అంచనా నెలకొన్నాయి. తాజాగా విడుదలైన గ్లిమ్స్ వీడియో సినిమాపై అంచనాలను తారస్థాయికి చేర్చింది.
దీంతో ఫ్యాన్స్ అంతా రేపు బన్నీ బర్త్ డే కి రాబోయే టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పుష్ప2 గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప పార్ట్ 2 లో బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ ఓ క్యామియో రోల్ లో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మూవీ యూనిట్ అక్షయ్ కుమార్ తో సంప్రదింపులు జరపగా.. ఆయన కూడా పుష్ప2 లో భాగమయేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజముంది అనేది ఇంకా క్లారిటీగా తెలియాల్సి ఉంది. ఒకవేళ పుష్ప2లో అక్షయ్ కుమార్ గాని నటిస్తే బాలీవుడ్ లో మరోసారి బన్నీకి తిరుగుండదనే చెప్పాలి.
పుష్ప ది రైస్ తో బాలీవుడ్ లో 100 కోట్ల మార్క్ ని అవలీలగా అందుకున్న బన్నీ ఈసారి పార్ట్ 2 తో అక్కడి బాక్సాఫీస్ ను షేక్ చేయడం గ్యారెంటీ అని చెబుతున్నారు సినీ విశ్లేషకులు. ఇక movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. నేషనల్ కష్ రష్మిక మందన బన్నీ సరసన హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. అనసూయ, సునీల్, ఫహాద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇక వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాది చివరికల్లా సినిమాని విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు...!!