విజయ్ ... సమంత పై అక్కడ ఖుషి మూవీ షూటింగ్..!

Pulgam Srinivas
నాగ చైతన్య హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఏం మాయ చేసావే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ... ఆ తర్వాత ఎన్నో విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ కొనసాగిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి సమంత గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఇది ఇలా ఉంటే సమంత తాజాగా శాకుంతలం అనే మూవీ లో కీలకమైన పాత్రలో నటించింది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో 2D మరియు 3D వర్షన్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇలా ఇప్పటికే అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో నటిస్తూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా శివా నిర్వాన దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

 ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ యొక్క షూటింగ్ అలిపి లో జరుగుతుంది. ప్రస్తుతం అలిపి లో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ లో విజయ్ మరియు సమంత పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. ఈ ఇద్దరి మధ్య ప్రస్తుత షెడ్యూల్ లో ఈ చిత్ర బృందం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని సెప్టెంబర్ 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: