అయ్యయ్యో.. ఆమెని బికినీలో చూడలేకపోతున్నారు..?

shami
బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కి పెద్ద చిక్కొచ్చి పడింది. అంతకుముందు బాలీవుడ్ సీరియల్స్ లో చేసి ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ ఛాన్సెస్ అందుకున్న మృణాల్ తెలుగులో సీతారామం తో మరో రేంజ్ కి వెళ్లింది. సీతారామం లో సీతామహాలక్ష్మి, నూర్జహాన్ పాత్రలతో మృణాల్ అదరగొట్టేసింది. ఆ సినిమా చూసి తెలుగు ప్రేక్షకులు ఆమెకు ఫిదా అయ్యారు. ప్రస్తుతం అమ్మడి నాని 30వ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా కోసం గోవాలో 40 రోజుల లాంగ్ షెడ్యూల్ మొదలు పెట్టారు.
అయితే సీతారామం తో మృణాల్ కి తెలుగులో సూపర్ క్రేజ్ వచ్చినా అది ఆమె చేసిన సీతామహాలక్ష్మి పాత్ర ద్వారా వచ్చింది. అయితే అది సినిమా మాత్రమే బయట ఆమె అలా ఉండదు. ఇక ఫోటో షూట్ లతో మృణాల్ రెచ్చిపోతుంది. లేటెస్ట్ గా మృణాల్ బికినీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మామూలుగా ఎవరైనా హీరోయిన్ బికినీ వేస్తే సూపర్ అనేస్తారు కానీ మృణాల్ ని మాత్రం ఆమెని ఆ సినిమాలో అలా చూసి బికినీలో చూడలేకపోతున్నాం అంటున్నారు.
బీచ్ లో బ్లూ కలర్ బికినీ తో అమ్మడు వావ్ అనిపించేస్తుంటే.. కింద కామెంట్స్ మాత్రం ప్లీజ్ మృణాల్ నువ్విలా చేయకు అంటూ కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్ అన్న తర్వాత అన్ని రోల్స్ చేయాల్సి ఉంటుంది. మృణాల్ గ్లామర్ రోల్స్ చేయకూడదా ఆమె బికినీ వేయకూడదా అంటూ కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. ఏది ఏమైనా తెలుగులో తనకు వచ్చిన క్రేజ్ తో మృణాల్ కి కొత్త హెడేక్ కూడా మొదలైందని చెప్పొచ్చు. నాని 30లో కూడా మృణాల్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తుందని తెలుస్తుంది. ఇదే కాదు తెలుగు నుంచి మృణాల్ కి మరిన్ని ఆఫర్లు వస్తున్నాయట కానీ అమ్మడు తన రోల్ కి సరైన ఇంపార్టెంట్ లేకపోతే చేయనని అంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: