'హరిహర వీరమల్లు' దసరాకి కష్టమే..?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ  బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పవన్ నటిస్తున్న సినిమాల్లో 'హరిహర వీరమల్లు' సినిమా కూడా ఒకటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే సుమారు నెలరోజులుగా షూటింగ్ ఆగిపోయిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈనెల 11వ తేదీ నుంచి కొత్త షెడ్యూల్ ని మొదలుపెట్టబోతున్నారు. ఈ షెడ్యూల్ కోసం నెల రోజుల క్రితం వేసిన సెట్ ఇంకా అలాగే ఉంది. ఈ సెట్ లో క్లైమాక్స్ కి ముందు వచ్చే ఓ సీక్వెన్స్ ను చిత్రికరించనున్నారు. 

ఇక ఈ షెడ్యూల్ లో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కూడా జాయిన్ కానుందట. సినిమాలో ఆమె రోల్ నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుందని అంటున్నారు. పైగా మొగలాయిల కాలంనాటి కథతో వస్తున్న ఈ సినిమాలో ఔరంగజేబు పాత్ర చాలా కీలకంగా మారనుంది. ఈ పాత్రని బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ పోషిస్తుండగా.మ్ సినిమాలో బాబీ డియోల్ కి నోరాఫతేహి కి సంబంధం ఉంటుందట.ఇక సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించబోతున్నాడుమ్ మెగా సూర్య ప్రొడక్షన్స్ నిర్మాత ఏం రత్నం ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తయితే ఈ సినిమాని దసరాకి విడుదల చేయాలనుకున్నారు మేకర్స్.

కానీ హరిహర వీరమల్లు షూటింగ్ ఇప్పటిలో పూర్తయ్యేలా కనిపించడం లేదు. దాంతో ఈ సినిమా దసరా విడుదల కష్టమే అని సమాచారం. దీంతో పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే మొదటిసారి పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఓ పౌరాణిక పాత్ర పోషిస్తుండటం తో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ దసరాకి విడుదలవుతుందనుకున్న ఈ సినిమా ఇప్పుడు షూటింగ్ ఆలస్యం కారణంగా వాయిదా పడిందనే విషయంతో ఫాన్స్ మూవీ టీం పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే సినిమా విడుదల వాయిదా వేస్తారా? లేదా అనే విషయాన్ని మూవీ టీం ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: